Begin typing your search above and press return to search.

సుప్రీం తీర్పుపై స్వామి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 Sept 2018 10:36 AM IST
సుప్రీం తీర్పుపై స్వామి సంచలన వ్యాఖ్యలు
X
సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377 కొట్టేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది. ఎల్.జీ.బీ.టీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిందేని.. అందిరితోపాటు వారికి సమాన హక్కులుంటాయని సుప్రీం స్పష్టం చేసింది.ఈ చారిత్రక తీర్పుపై లెస్బియన్ - గేస్ - బై సెక్స్ వల్స్ - ట్రాన్స్ జెండర్స్(ఎల్.జీ.బీ.టీ)లు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ దీనిపై సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ లో మాత్రం వ్యతిరేకత వస్తోంది..

తాజాగా ఈ తీర్పుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోమో సెక్స్ వల్ అనేది జన్యుపరమైన రుగ్మత అని.. ఈ తీర్పు వల్ల హోమోసెక్స్ ఎక్కువై హెచ్.ఐ.వీ కేసులు పెరిగే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కం చేయడం నేరం కాదని.. చెప్పడం వల్ల సాంఘీక దురాచారాలు, లైంగిక సంక్రమణ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు అంతిమం కాదని.. ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిని రద్దు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇక ఈ చారిత్రక తీర్పుపై ఆర్ఎస్ఎస్ కూడా విచారం వ్యక్తం చేసింది. సంపర్కం - స్వలింగ వివాహాలు ప్రకృతి విరుద్దమని.. అలాంటి సంబంధాలు సభ్య సమాజంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. తాము కూడా సుప్రీం కోర్టు తీర్పు చెప్పినట్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూడకపోయినా.. తాము మాత్రం మద్దతు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.