Begin typing your search above and press return to search.
స్వామి దెబ్బకు బీజేపీ కొత్త నిర్ణయం
By: Tupaki Desk | 29 Jun 2016 12:44 PM GMTనిత్యమూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న సుబ్రహ్మణ్యస్వామి మరో రకంగా బీజేపీని టార్గెట్ చేశారు. అనవసర ప్రసంగాలు చేయవద్దని సుబ్రహ్మణ్యస్వామికి హెచ్చరిక జారీచేయడమే కాకుండా పార్టీకి చెందిన రెండు సమావేశాలను వాయిదా వేసుకున్నారు.
ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై వ్యాఖ్యలు చేస్తున్నంత కాలం చూస్తూ ఉన్న బీజేపీ ఇటీవల ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను మా త్రం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ప్రధాని మోడీ స్వయంగా ఆయన వైఖరిని తప్పుబడుతూ, వ్యవస్థ కన్నా తాము అధికులమని ఎవరైనా భావిస్తే, అది తప్పు అని మెత్తగా మొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతల నుంచి స్వామి ప్రసంగానికి అనుమతి పొందిన తరువాతే సమావేశాలకు ఆయన్ను ఆహ్వానించాలని స్పష్టమైన ఆదేశాలున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన మాట్లాడేందుకు అనుమతి లేకపోవడంతోనే రెండు కార్యక్రమాలను రద్దు చేసినట్టు సమాచారం. ముంబైలో జరగాల్సిన ఓ కార్యక్రమాన్ని - చెన్నైలో ఆర్ ఎస్ ఎస్ తలపెట్టిన మరో ప్రోగ్రామ్ నూ రద్దు చేసుకున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండింటిలో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడాల్సి ఉండగా ఆయనేం వ్యాఖ్యలు చేస్తారోనన్న భయంతోనే వీటిని రద్దు చేసినట్టు సమాచారం.
ఇదిలాఉండగా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి తిట్లుతిన్న సుబ్రహ్మణ్యస్వామి అనంతరం వేదాంతం వల్లించిన సంగతి తెలిసిందే. ప్రపంచం అన్ని రకాలుగా ఒకేలా ఉంటుందని, ఎక్కడ చిన్న మార్పు వచ్చినా, అది అన్ని విషయాలనూ ప్రభావితం చేస్తుందని ట్వీట్ చేశారు. స్వామి ఈ శ్లోకం చెప్పడంపై నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. స్వామి ట్వీట్ ను 675 మంది రీట్వీట్ చేయడం గమనార్హం.