Begin typing your search above and press return to search.

సుబ్రహ్మణ్యస్వామికి సూపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   23 Sept 2015 10:26 PM IST
సుబ్రహ్మణ్యస్వామికి సూపర్ ఆఫర్
X
సుబ్రహ్మణ్య స్వామి…జనతా పార్టీ అధినేతగా ఉన్న ఈ సీనియర్ రాజకీయ వేత్తది కాంగ్రెస్ ను ముప్పుతిప్పలు పెట్టడంలో అందెవేసిన చేయి. గత ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ తెరమీదకు రావడంతో తన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేసి… కమళదళం కోసం దేశవిదేశాల్లో ప్రచారం చేశారు. అనంతరం కూడా అవకాశం దొరికిన ప్రతి వేదికల్లో బీజేపీకి మద్దతుగా…..దేశ ప్రయోజనాలకోసం గళం విప్పారు. తాజాగా ఆయన్ను సముచిత రీతిలో గౌరవించేందుకు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్దమయింది. అయితే స్వతహాగా లాయర్ అయిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో ట్విస్టులకు అవకాశం కల్పించారు.

ఢిల్లీలోని విఖ్యాత జవహర్ లాల్ యూనివర్సిటీ వీసీగా సుబ్రహ్మణ్యస్వామి పేరు దాదాపుగా ఖరారైంది. అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సుబ్రహ్మణ్యస్వామికి ఇప్పటికే సమాచారం అందించారు. మంత్రి సృతి ఇరాణీ స్వయంగా సుబ్రహ్మణ్యస్వామితో మాట్లాడారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే స్వామి ఈ పదవి చేపట్టేందుకు అంగీకరించడానికి కొన్ని షరతులు విధించినట్లు చెబుతున్నారు. తన అభిప్రాయలకు అనుగుణంగా నడుచుకునే స్వేచ్ఛ ఇస్తేనే బాధ్యతలు చేపడతానని, పార్టీకి సంబంధించిన సమావేశాల్లోనూ తాను గళం వినిపిస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. ప్రధానమంత్రి మోడీతో చర్చించిన తర్వాత తుదినిర్ణయం వెలువడే అవకాశం ఉంది.