Begin typing your search above and press return to search.

అక్రమ సంబంధాలకు అసలు కారణం ఏమిటో చెప్పిన స్టడీ

By:  Tupaki Desk   |   10 Nov 2020 6:30 AM GMT
అక్రమ సంబంధాలకు అసలు కారణం ఏమిటో చెప్పిన స్టడీ
X
పెళ్లైన వారు పక్కచూపులు ఎందుకు చూస్తారు? అక్రమ సంబంధాలు అంతకంతకూ ఎందుకు పెరుగుతున్నాయి? దానికి కారణం ఏమిటి? కాపురాల్ని కూల్చటమే కాదు.. అనవసరమైన ఇబ్బందుల్లోకి నెట్టేసే అక్రమ సంబంధాలపై తాజాగా ఒక స్టడీ నిర్వహించారు. ఎందుకిలా జరుగుతుందన్న విషయాల్ని విశ్లేషించారు. ఈ సందర్భంగా కొత్త అంశాలు వెలుగు చూశాయి.

జీవిత భాగస్వామి ఉన్నప్పటికి పక్క చూపులు చూడటానికి కారణం.. పార్టనర్ అందంగా లేకపోవటం.. భాగ్వామితో రొమాన్స్ తగ్గటం.. ఆకర్షణ తగ్గిపోవటం.. లాంటి అంశాలతోనే కొత్త సంబంధాల కోసం ఆరాటపడుతుంటారని చెబుతున్నారు. అయితే.. ఇలా చేసే వారు.. తాము ఎందుకలా చేస్తున్నామన్న విషయం తెలీకుండానే చేసేస్తుంటారన్న విషయాన్ని తాజా పరిశోధనలో తేల్చారు.

వివాహేతర సంబంధాలకు బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలు కూడా కారణంగా చెబుతున్నారు. కొత్తగా పెళ్లైన దాదాపు 233 జంటలపై పరిశోధనలు జరిపిన సందర్భంగా అక్రమ సంబంధాలు ఏర్పడటానికి కారణం ఏమిటన్న అంశాన్ని విశ్లేషించారు. తమ వైవాహిక జీవితం పట్ల అసంతృప్తితో ఉన్న వారు.. వేరే వ్యక్తుల నుంచి సుఖాన్ని ఆశిస్తున్నట్లుగా తాజా పరిశోధన స్పష్టం చేసింది. అయితే.. ఇలాంటి సంబంధాల కోసం ఆడవాళ్ల కంటే మగాళ్లే ఎక్కువ ఇంట్రస్టు చూపించినట్లుగా తేల్చారు.