Begin typing your search above and press return to search.
భూమి డేంజర్ బెల్స్.. మనిషి చేసిన ఎదవ పనులకు హాహాకారాలు
By: Tupaki Desk | 2 Jun 2023 6:00 PM GMTసమస్త భూమండలంలో అత్యంత ఆశపోతు జీవి ఏదన్న ప్రశ్నను సంధిస్తే.. వచ్చే సమాధానం మనిషి. వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది కఠోర సత్యం. భూమి మీద ఉన్న ఏ జీవి అయినా తన ఆకలి తీర్చుకోవటానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. మనిషి మాత్రం అందుకు భిన్నం. ఆకలి తీర్చుకోవటం కంటే కూడా అత్యంత సుఖంగా ఉండాలని.. తన ఆశల్ని తీర్చుకోవటం కోసం ఎంత నాశానికైనా వెనకాడని తీరు అతడి సొంతం.
భూమి ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి కారణాలకు సంబంధించిన అంశాల మీద 40 మందితో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల టీం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా నేచర్ జర్నల్ లో పబ్లిష్ అయ్యింది. అందులో.. మనిషి అధిపత్య ధోరణి.. చివరకు భూమి నివాసానికి ఆమోదయోగ్యం కానంత దారుణంగా మారిందన్న విషయాన్ని వారు పేర్కొన్నారు.
ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తల్లో ఒకరైన క్రిస్టీ ఎబి మాటల్లో చెప్పాలంటే.. 'మనిషికి చేసినట్లే భూమికి ఏడాదికి ఒకసారి చేయించే హెల్త్ చెకప్ లాంటిది చేయిస్తే.. ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందన్న రిపోర్టు వస్తుందని.. కీలక అవయువాలన్నీ దాదాపు మూలకు పడుతున్నాయని తేలుతుందని చెప్పారు.
ఆయన మాటల్ని మరోలా చెప్పాలంటే.. ఏ క్షణంలో అయినా వెంటిలేటర్ మీదకు ఎక్కే పరిస్థితిలోకి వెళ్లిపోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇంతకీ క్రిస్టీ ఎవరంటే.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో ప్రొఫెసర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.
భూమి భద్రతకు సంబంధించి స్థూలంగా 8 రకాల సూచీని పర్యావరణవేత్తలు కీలకంగా పరిగణిస్తారని.. వీటిల్లో మూడుకు మించి ఎక్కువ సూచీలు ఆమోదత పరిమితి దాటితే భూమికి ముప్పు తప్పదని భావిస్తారని.. ఇప్పుడు ఏకంగా ఏడు సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేసి.. ప్రమాదకర స్థితికి చేరుతున్నట్లుగా ఎర్త్ కమిషన్ అధ్యయనం తేల్చటం చూస్తే.. రెడ్ ఫ్లాగ్ ఎగిరినట్లేనని చెప్పాలి.
భూమికి డేంజర్ స్పాట్స్ కు నిలయాలుగా మారుతున్న ప్రాంతాల్ని చూస్తే.. తూర్పు యూరప్.. దక్షిణాసియా మధ్యప్రాచ్యం.. ఆగ్నేయాసియా.. ఆఫ్రికాలో పలు ప్రాంతాలు.. బ్రెజిల్ లో చాలా ప్రాంతాలు.. అమెరికాలో చాలా ప్రాంతాలు.. మెక్సికో.. చైనాలుగా గుర్తించారు. మొత్తంగా చూస్తే.. జీవరాశుల ఉనికికే ఎసరొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఈ అధ్యయనకర్తలు తేల్చారని చెప్పాలి.