Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ప్రపంచ అమ్మళ్లు అంతా అంతేనట

By:  Tupaki Desk   |   18 April 2016 10:30 PM GMT
ఆ విషయంలో ప్రపంచ అమ్మళ్లు అంతా అంతేనట
X
చిత్రవిచిత్రమైన అంశాల మీద పరిశోధనలు జరపటం ప్రాశ్చాత్య దేశాల వారికి అలవాటే. తాజాగా అలాంటి చిత్రమైన ఒక అంశంపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇంతకీ ఆ అంశం ఏమిటంటే.. నవ్వు నలభై రకాలుగా ఉంటుందంటారు కదా.. మరి.. అతివల చిరాకు ఎన్ని రకాలుగా ఉంటుందన్న డౌట్ వచ్చేసింది. మనసులోకి వచ్చిన సందేహాన్ని అలా వదిలేయకుండా ధాని మీద ఒక సర్వే నిర్వహించారు.

దీనికి అమెరికా.. బ్రిటన్.. స్పెయిన్.. చైనా ఇలా రకరకాల దేశాలకు చెందిన అతివలతో ఈ పరిశోధన చేపట్టారు. మీకు నచ్చని విషయానికి మీరు ఎలా ఎక్స్ ప్రెస్ చేస్తారు? మాటల్లో కాకుండా కేవలం ఫీలింగ్స్ తో ఎలా చేస్తారని అడిగారు. దీనికి వచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ప్రపంచంలోని అతివలంతా నచ్చని విషయంలో మూతి తిప్పటం.. కనుబొమ్మలు ఎగరేయటం.. చుబుకంకాస్త పైకి వెళ్లటం.. ముక్కు వంకరపోవటం లాంటి కొన్ని ఎక్స్ ప్రెషన్లను దేశాలకు అతీతంగా అందరూ అవే విధానాల్ని ప్రదర్శించారట. ఇదంతా చూస్తే.. ప్రపంచంలో ఆడోళ్లంతా ఒక్కటేనన్న మాట అనిపించక మానదు.