Begin typing your search above and press return to search.

కరోనాలోనూ భద్రమైన చదువు..ఏం ఐడియా గురూ!

By:  Tupaki Desk   |   10 Sep 2020 1:30 PM GMT
కరోనాలోనూ భద్రమైన చదువు..ఏం ఐడియా గురూ!
X
ప్రపంచమంతా కరోనా మహమ్మారి దెబ్బకు చిన్నా భిన్నం అయ్యింది. వివిధ కార్యాలయాలు, పాఠశాలలు, nకళాశాలలు మూతపడ్డాయి. పిల్లా పెద్దా ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యార్థుల చదువు అటకెక్కింది.కొన్ని పాఠశాలలు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఉపాధ్యాయులు నేరుగా క్లాస్​రూంలో ఉండి చెబితేనే విద్యార్థులు చదవడం, చదివిన దాన్ని బుర్రకెక్కించుకోవం కష్టం. ఇక ఆన్​లైన్​ క్లాస్​లో వాళ్లు ఏం వింటున్నారో.. ఏం నేర్చుకుంటున్నారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ కరోనా ఎప్పటికి పోతుందో.. క్లాసులు ఎప్పుడు ప్రారంభవుతాయోనని ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్​. ఈ నేపథ్యంలో ఇరాన్​కు చెందిన ఓ పాఠశాల వినూత్నంగా ఆలోచించింది. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత తరుణంలోనూ ఎలాగైనా పిల్లలను పాఠశాలకు రప్పించాలని ఆలోచించింది. అందుకనుగుణంగా తరగతి గది రూపు రేఖలను పూర్తిగా మార్చివేసింది.

ప్రతి విద్యార్థి కరోనా నుంచి రక్షణ పొందేలా ఓ గుడారాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా వ్యాధి ఒక విద్యార్థి నుంచి మరో విద్యార్థికి వ్యాధి సంక్రమించకుండా ఏర్పాట్లు చేసింది. ఒక విద్యార్థికి మరో విద్యార్థికి నిర్ణీత దూరంతో ఏర్పాటుచేయడంతోపాటు.. పిల్లలకు ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా క్యాబిన్లను ఏర్పాటు చేసింది. ఈ ఆలోచన ఎంతవరకూ సక్సెస్​ అవుతుందో వేచిచూడాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు అయితే సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. చూసిన వారంతా ఐడియా భలేగా ఉందని అంటున్నారు.