Begin typing your search above and press return to search.

స్మార్ట్ ఫోన్లో ఆన్‌ లైన్ క్లాసులు కాదు అశ్లీల వీడియోలు చూస్తున్నారు!

By:  Tupaki Desk   |   20 March 2021 12:39 AM GMT
స్మార్ట్ ఫోన్లో ఆన్‌ లైన్ క్లాసులు కాదు అశ్లీల వీడియోలు చూస్తున్నారు!
X
కరోనా నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమిత‌మైన విద్యార్థులు.. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆన్ లైన్ చ‌దువులు కొన‌సాగిస్తున్నారు. అయితే.. ఈ కార‌ణంతో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు పూర్తిగా ఫోన్ అప్ప‌జెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. అయితే.. టీనేజ్ లోని చాలా మంది పిల్ల‌లు ఆన్ లైన్ క్లాసుల త‌ర్వాత అశ్లీల వీడియోలు చూస్తున్నార‌ని తెలుస్తోంది. తాజాగా.. అశ్లీల వీడియోలు చూసిన ఓ విద్యార్థి చిన్నారిపై అత్యాచారం చేశాడు!

రాజ‌స్థాన్ లోని ఝ‌న్‌జును ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువ‌కుడు స్మార్ట్ ఫోన్‌ లో అశ్లీల వీడియోలు చూడ‌డానికి అల‌వాటు ప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే ఓ రోజు వీడియోలు చూసిన ఉద్రేకంలో ఉన్న యువ‌కుడు.. త‌న ఇంటి ప‌క్క‌న ఉండే ఐదేళ్ల బాలిక‌ను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయ‌స్థానం.. మ‌ర‌ణ దండ‌న విధించింది. అయితే.. విచార‌ణ‌లో తేలింది ఏమంటే.. తాను రోజూ అశ్లీల వీడియోలు చూసేవాడిన‌ని ఒప్పుకున్నాడు స‌ద‌రు యువ‌కుడు.

యూపీలోనూ ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. మొబైల్ లో అశ్లీల వీడియోలు చూడ‌డానికి అల‌వాటు ప‌డిన 13 సంవ‌త్స‌రాల బాలుడు.. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌లియాలోని రేవ‌తి బ్లాకులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.

ఈ ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు స్పందిస్తూ.. అశ్లీల వీడియోలు చూడ‌డానికి అల‌వాటు ప‌డుతున్న టీనేజర్లు, యువ‌కులు.. ఆడ‌వాళ్ల‌పై దారుణాల‌కు తెగ‌బ‌డ‌తూ.. త‌మ‌ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నార‌ని అన్నారు. అందువ‌ల్ల త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. పిల్ల‌ల‌కు ఆన్ లైన్ త‌ర‌గ‌తుల పేరుతో ఫోన్లు అప్ప‌గించి వ‌దిలేయ‌కుండా.. వారు ఏం చేస్తున్నారో కూడా దృష్టి సారించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.