Begin typing your search above and press return to search.

సమాధి లో విద్యార్థులు.. వింతైన ఘటన

By:  Tupaki Desk   |   13 Nov 2019 1:30 AM GMT
సమాధి లో విద్యార్థులు.. వింతైన ఘటన
X
పరీక్షల ఒత్తిడి ఉంటే మీరేం చేస్తారు? మాములుగా అయితే ధాన్యం లేదా యోగా లాంటివి చేయిస్తారు. కానీ ఈ యూనివర్సిటీ మాత్రం ఎక్కడ లేని వింతైన సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. పుర్రెకో బుద్ది అంటారు పెద్దలు. ఇప్పుడీ యూనివర్సిటీ బుద్ది కూడా అలానే తయారైంది. బతుకుండగానే విద్యార్థుల ను సమాధి లో పడుకోబెడుతోంది. సమాధి లో పడుకోవడం అంటేనే అందరూ అమ్మో అని భయపడుతారు.. చీచీ మా ఖర్మ పట్ట లేదంటారు. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం ఎగబడుతున్నారు. ఇదేదో చెడు కార్యక్రమం కాదు.. మంచి కోసం చేసిన పనే.కానీ చేసే పద్ధతే బాగా లేదంటున్నారు..

నెదర్లాండ్ దేశం లోని నిజ్మాజెన్ నగరంలో రాడ్ బౌడ్ యూనివర్సిటీ కి వింతైన ఆలోచన ఒకటి వచ్చింది. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి ని దూరం చేసి వారి లో ఉత్సాహం నింపేందు కు సమాధుల లో పడుకో బెడుతున్నారు. ‘ధ్యాన సమాధి’ పేరు తో యూనివర్సిటీ లోని పచ్చని ప్రకృతి మధ్య ఐదారు సమాధులు తవ్వి అందులో పడుకొని ధ్యానం చేస్తూ ఒత్తిడి తగ్గించుకోవాలని యూనివర్సిటీ సూచిస్తోంది. 30 నిమిషాల నుంచి 3 గంటలు ఇలా సమాధి లో మెడిటేషన్ చేస్తే మీ ఒత్తిడి మటు మాయం అని ఉచిత సలహా ఇస్తోంది.

అయితే యూనివర్సిటీ విద్యార్థుల కు ఈ సమాధి లో ధాన్యం కాన్సెప్ట్ తెగ నచ్చేయడం విశేషం. దానిలో పడుకోవడానికి ఇప్పుడు క్యూ కడుతున్నారు. అదో వింతైన అనుభూతి ఉందంటున్నారు. కొందరు సెల్ఫీలు, వీడియోలు తీసుకొని వైరల్ చేస్తున్నారు.

సమాధి లో పడుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తుండడం తో సమాధుల్లో పడుకోవడానికి ఇఫ్పుడు వారానికి పైగా క్యూలిస్ట్ ఉందట.. తమకు వచ్చే చాన్స్ కోసం స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే కొందరు మాత్రం సమాధి లో పడుకోవాల్సిన ఖర్మ మాకు లేదంటూ యూనివర్సిటీ చర్య పై మండిపడుతున్నారు. మరి సమాధిలో పడుకున్న వారికి ఎందుకంత ఆనందమో తెలియాలంటే వారినే అడగాలి.