Begin typing your search above and press return to search.

హిందీ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులు ... ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   15 Jan 2021 4:30 PM GMT
హిందీ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులు ... ఎక్కడంటే ?
X
హిందీ .. భారతదేశం జాతీయ భాష. అయితే , దేశంలో జీవించాలంటే హిందీ తప్పనిసరి ఏం కాదు. ఇక, ఇండియాలో ఉద్యోగం చేయాలంటే హిందీ తప్పనిసరి ఏమి కాదు , ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు ఇదే వ్యవహారం రచ్చ గా మారుతుంది. హిందీ భాష కోసం దక్షిణ కోరియా విద్యార్థులు పోరాటం ప్రారంభించారు. హిందీ భాషా అధ్యయనానికి సంబంధించిన కోర్సును తొలగించద్దొంటూ బూసాన్ యూనివర్శిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్ యూనివర్శిటీని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. హిందీ భాషా కోర్సులను తొలగించేందుకు యూనివర్శిటీ అధికారులు నిర్ణయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా.. ఈ విషయమై సియోల్‌ లోని భారత్ ఎంబసీకి కూడా ఫిర్యాదు చేశారు. దక్షిణ కొరియాలోని బూసాన్ యూనివర్శిటీ, హాన్‌ కుక్ యూనివర్శిటీలు మాత్రమే హిందీ భాష అధ్యయనానికి అవకాశం కల్పిస్తున్నాయి. బూసాన్ విశ్వవిద్యాలయంలో 1983లో హిందీ భాష కోసం ఇండియన్ స్టడీస్ విభాగం ఏర్పాటవగా.. 1972 నుంచే హాన్‌ కుక్ యూనివర్శిటీలో హీందీ భాషపై ప్రత్యేక కోర్సులు ఉనికిలో ఉన్నాయి. కాగా.. కొద్ది వారాల క్రితం ఇండియన్ స్టడీస్ విభాగం కీలక ప్రకటన చేసింది.

హీందీ భాషకు సంబంధించిన కోర్సులకు ముగింపు పలికే యోచనలో యూనివర్శిటీ ఉందనేది ఈ ప్రకటన సారాంశం. భారత్‌ లో పనిచేయాలనుకునే దక్షిణకొరియా వారికి ఇంగ్లీష్ వస్తే సరిపోతుందని కూడా పేర్కొంది. అయితే..ఈ ప్రకటనతో హిందీ భాషా కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది. దీంతో వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తమ నిరసల తెలుపుతున్నారు. ఈ విషయమై లీ జున్ ‌హాక్ అనే వ్యక్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హీందీ భాష అధ్యయనం ద్వారా భారత్‌లోని మారుమూల ప్రాంతాలను కూడా చేరుకుని అక్కడి సంస్కృతులను అధ్యయం చేయచ్చని తెలిపాడు.