Begin typing your search above and press return to search.

హాస్టల్ లో కత్తులతో ఫైటింగ్

By:  Tupaki Desk   |   8 Oct 2015 6:29 AM GMT
హాస్టల్ లో కత్తులతో ఫైటింగ్
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలేజీ విద్య అన్న వెంటనే గుర్తుకొచ్చేవి ప్రైవేటు విద్యా సంస్థలే. డబ్బులున్నా.. లేకున్నా.. ఏదో ఒకటి చేసి ఇంటర్ వరకూ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివించటం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. మార్కులు.. ర్యాంకుల పోటీలతో ప్రైవేటు విద్యా సంస్థల మధ్య నెలకొన్న పోటీ పుణ్యమా అని విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి నెలకొంది.

ఇది కొన్నిసార్లు హద్దులు దాటి విపరీత చర్యలకు కారణం అవుతోంది. తాజాగా విశాఖలోని ఒక ప్రముఖ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు బస చేసిన హాస్టల్ లో మొదలైన చిన్న గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. సెల్ ఫోన్ పోయిందన్న వివాదంతోమొదలై.. కాసేపటికే విద్యార్థులు రెండు జట్లుగా మారిపోయి.. ఒకరినొకరు కొట్టుకోవటం వరకూ వెళ్లారు. ఇదే సమయంలో కొందరు కత్తులు తీసి మరీ ఫైటింగ్ లోకి ఎంటర్ కావటంతో పరిస్థితి మరింతగా అదుపు తప్పింది.ఈ దాడిలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు అయినట్లు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇష్టారాజ్యంగా సాగుతున్న ప్రైవేటు కాలేజీల విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.