Begin typing your search above and press return to search.
అమెరికాకు వెళ్లి చదివే విద్యార్థుల వీసాల కు అధిక ప్రాధాన్యం
By: Tupaki Desk | 20 April 2023 9:21 AM GMTవిద్యార్థులకు తీపి కబురు చెప్పింది అమెరికన్ కాన్సులేట్. కరోనా పుణ్యమా అని యూఎస్ వీసాల కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళలో. అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా టాప్ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా పేర్కొంది. రానున్న జూన్ జులై నెలల్లో వీసా స్లాట్లలో అధికభాగం విద్యార్థులకే ప్రయారిటీ ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక అంశాల్ని వెల్లడించారు.
వీసా కోసం ఎదురుచూసే కాలాన్ని మరింత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్న కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మరిన్ని విషయాల్ని వెల్లడించారు. ఆమె చెప్పిన అంశాల్లో కీలకమైనవి చూస్తే.
- అమెరికాలో వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. విద్యార్థి వీసాల్ని పొందేందుకు నాలుగు అంశాలు చాలా కీలకం. మంచి విద్యా సంస్థను ఎంపిక చేసుకొని వారి నుంచి అనుమతి పత్రమైన ఐ20ను సబ్మిట్ చేయటం. చదవాలనుకునే కోర్సు మీద కనీస అవగాహన కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన ఫీజు ఇతర ఖర్చులు చెల్లించే ఆర్థిక స్తోమత. కోర్సును పూర్తి చేశాక మాతృదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టత చాలా ముఖ్యం.
- ఇంటర్వ్యూ సమయంలో ఆయా వివరాల్ని విద్యార్థులు నిజాయితీగా వెల్లడించాలి. వీసాను రిజెక్టు చేసిన పక్షంలో ఏ నిబంధన మేరకు ఇంటర్వ్యూ అధికారి సదరు నిర్ణయం తీసుకున్నారో స్పష్టం చేస్తూ విద్యార్థికి తక్షణమే లిఖిత పూర్వక సమాచారాన్ని అందిస్తాం. జూన్ జులై లోని వీసా స్లాట్లలో అత్యధిక భాగం విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తాం.
- పర్యాటక వీసా కోసం కరోనా టైంలో రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం దాన్ని ఆర్నెల్లకు తగ్గించాం. రానున్న రోజుల్లో మరింత తగ్గే వీలుంది. వీసాల రెన్యువల్స్ కోసం దరఖాస్తుదారులు కాన్సులేట్ కు వచ్చే పని లేకుండా డ్రాప్ బాక్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం.
- గతంలో జారీ చేసిన ఎఫ్1 వీసాలు ఉన్న విద్యార్థులు కూడా డ్రాప్ బాక్స్ నిబంధనలకు అర్హులై ఉంటే వారుఆ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. తొలిసారి వీసా కోసం అప్లికేషన్ చేసుకున్న వారు మాత్రమే కాన్సులేట్ కు వచ్చేలా చూస్తున్నాం.
- దక్షిణాసియాలోనే అతి పెద్ద అమెరికన్ కాన్సులేట్ గా హైదరాబాద్ చరిత్రలో నిలుస్తుంది. వీసా కోసం వెయిట్ చేసే సమయాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అమెరికా కాన్సులేట్ కార్యాలయాల నుంచి సిబ్బందిని గుర్తించి భారత్ లోని వివిధ కాన్సులేట్ కు అమెరికా ప్రభుత్వం పంపుతోంది. గతంతో పోలిస్తే ఎక్కువమంది అధికారులు ఈ ఏడాది నుంచి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
- ఈ ఏడాది 10 లక్షల వీసా అప్లికేషన్లను చూడాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నాం. హైదరాబాద్ చాలా యాక్టివ్ గా ఉంది. రెండు దేశాల సంబంధాల బలోపేతంలో ఈ ప్రాంతం కీలకంగా వ్యవహరిస్తోంది.
- పైగా ప్యాలెస్ లో అత్యధికంగాఒక రోజు 1100వీసా ఇంటర్వ్యూలను నిర్వహించాం. కొత్త కాన్సులేట్ కార్యాలయంలో అన్ని రకాలు కలిపి ఒక రోజు 3500 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు వీలుగా సదుపాయాలను ఏర్పాట్లు చేశాం. పూర్తి సామర్థ్యానికి తీసుకురావటానికి కొంత టైం పడుతుంది.
- వీసా అమెరికా పౌరుల పాస్ పోర్టు తదితర సేవల కోసం పైగా ప్యాలెస్ లో 16కేంద్రాలు ఉంటే కొత్త కాన్సులేట్ లో ఆ సంఖ్యను 54కు పెంచాం. వాణిజ్య సంబంధాలు ఈ ప్రాంతంలో గణనీయంగా ఉండటంతో విదేశీ వాణిజ్య సేవల అధికారిని ప్రత్యేకంగా అమెరికా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది.
- ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది హెచ్, ఎల్ తదితర వీసాలు పొందిన వారిలో భారతీయులు 65 శాతం ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో చదువుకోవటానికి వచ్చే విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా 17.5 శాతం భారతీయులే ఉన్నారు.