Begin typing your search above and press return to search.

టీడీపీ ఆఫీసు ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

By:  Tupaki Desk   |   23 Jan 2020 3:43 PM IST
టీడీపీ ఆఫీసు ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
X
అమరావతి పేరిట రాజకీయం చేస్తున్న తెలుగు దేశం పార్టీకి తొలి సెగ తగిలింది..శాసనమండలిలో అమరావతి రాజధానికి మద్దతుగా టీడీపీ పోరాడుతుండడంపై కర్నూలులో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

మూడు రాజధానులను టీడీపీ వ్యతిరేకించి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడాన్ని నిరసిస్తూ కర్నూలులో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాయి. కర్నూలును జగన్ న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కర్నూలులో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి.

కర్నూలులో గురువారం విద్యార్థి సంఘాలన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించాయి.ఆఫీసు బయట రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో శాంతించారు. లేకపోతే టీడీపీ ఆఫీసు చెల్లచెదురయ్యేది.

చంద్రబాబు వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు.చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. టీడీపీ నేతల ఇళ్ల ను ముట్టడిస్తున్నారు.