Begin typing your search above and press return to search.

స్టూడెంట్ యూనియర్ లీడర్... ఏపీ పీసీసీ అధ్యక్షుడా... ?

By:  Tupaki Desk   |   15 Dec 2021 12:33 PM GMT
స్టూడెంట్ యూనియర్ లీడర్... ఏపీ పీసీసీ అధ్యక్షుడా... ?
X
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత... వైఎస్సార్సీపీ ఏర్పడిన తరువాత... వైఎస్సార్ చనిపోయిన తరువాత...టీయారెస్ బలపడిన తరువాత... విడిపోయిన రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ చతికిలపడిపోయింది.

కొంచెం తెలంగాణాలో ఉన్నా కూడా అది తెలంగాణా ఇచ్చిన పార్టీ అని కొంత సానుభూతి మాత్రమే. గత రెండు ఎన్నికల్లో టీయారెస్ దెబ్బకు రెండు సార్లు కాంగ్రెస్ ఓడిపోయింది.

అయితే ఏపీలో కనీసం వేయి ఓట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు అంటే అతిశయోక్తి మాత్రం కాదు. ఇందిరాగాంధీ టైమ్ నుంచి తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అంటే మన పార్టీ అనే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అలాంటి పార్టీని సోనియా గాంధీ చెప్పుడు మాటలు విని విడగొట్టింది అని ఏపీలో జనాలు అనుకొని ఆరడుగుల గోతిలో ఆ పార్టీని పాతిపెట్టేశారు.

అయితే ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీల తీరును చూసిన మీదట ప్రజల అభిప్రాయం పూర్తిగా మారుతోందా అంటే అదే చర్చగా ఉంది. ఇక్కడ చెప్పాలి అంటే తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ప్రజాభిమానాన్ని ఏ మాత్రం పొందలేకపోయాయి అన్నదే నిజం అంటున్నారు.

ఈ నేపధ్యంలో జాతీయ స్థాయిలో ఈ రోజుకీ అధికారం పొందేందుకు అవకాశాలు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల జనంలో భావన మారుతోందా అన్న చర్చ అయితే ఉంది. అయితే ఏపీ కాంగ్రెస్ కి వచ్చిన చిక్కు ఏంటి అంటే పాత కాంగ్రెస్ వాళ్లంతా వయసు మీదపడిపోయిన వారే ఉన్నారు.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్ల జనంలో అంతకంతకు అభిమానం పెరుగుతున్నా కూడా సరైన నాయకత్వ లోపం మాత్రం ఉందని చెప్పాలి. తెలంగాణాలో రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ లో ఉత్తేజం వచ్చింది. ఆయన డైనమిక్ లీడర్ షిప్ తో కాంగ్రెస్ అక్కడ గట్టిగానే దూసుకుపోతోంది. మరి ఏపీలో పాతరం సైడ్ అయిపోతోంది. కొత్తతరానికి పరిచయం అయ్యే ముఖాలు అయితే లేవు అనే చెప్పాలి.

దాంతో కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకుని ఏపీలో నడిపించే వారి అవసరం ఉందనే చెప్పాలి. అలాంటి నవ యువ నాయకత్వానికే అవకాశం ఇవాలని కాంగ్రెస్ లో చర్చ అయితే సాగుతోంది అంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కి అనుకూలత ఉంది నూతన నాయకత్వం రావాలి ఏపీ కాంగ్రెస్ కి అన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందని అనుకుంటున్నారు.

దాంతో తెలంగాణాలో చేసిన ప్రయోగం మారిదిగానే ఏపీలో కూడా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకత్వానికి పార్టీ బాధ్యతలు అప్పగించాని భావిస్తున్నారుట. అది కూడా బలమైన రెడ్డి సామాజికవరానికి చెందిన వారికే బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు అంటున్నారు.

ఎందుకంటే టీడీపీలో యూత్ ఐకాన్ అన‌దగిన నాయకులు ఉన్నారని, వైసీపీలో అయితే యూత్ కి విలువ లేదని ఇక కాంగ్రెస్ లో యూత్ లీడర్ కి బాధ్యతలు అప్పగించి ఆయనకు ఆర్ధికంగా గట్టి భరోసా ఇచ్చి పార్టీని నడిపించమంటే కచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ లేచి బట్టకడుతుంది అన్న చర్చ అయితే ఆ పార్టీలో జరుగుతోంది అంటున్నారు.

ఈ మేరకు రాహుల్ గాంధీకి ఫీడ్ బ్యాక్ వచ్చిందని, ఆయన దీని మీద సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు అని టాక్. రెడ్డి సామాజిక వర్గానికి బలమైన నాయకుడికి పగ్గాలు అప్పగించడానికి రాహుల్ అయితే రెడీ అంటున్నారు.

మొత్తానికి స్టూడెంట్ లీడర్ గా ఉన్న వారికి వర్తమాన సమాజాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వారిని, జనాలను, ముఖ్యంగా యూత్ ని కదిలించగలిగే వారికి పీసీసీ పట్టం కడితే ఏపీలో కాంగ్రెస్ రధం తిరుగులేకుండా పరుగులు తీస్తుంది అంటున్నారు.

ఇది నిజం కూడా. ఏపీలో ఇపుడున్న పరిస్థితులను చూసి జనం విసిగి వేసారిపోయారు. చంద్రబాబును, జగన్ని చూసిన జనాలకు మరో పార్టీగా కాంగ్రెస్ కళ్ల ముందు కనిపించడం అన్నది ఆశ్చర్యం అయితే కాదు.

కాంగ్రెస్ జాతీయ పార్టీ. రేపటి రోజున కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ. అలాంటి పార్టీ అండ ఉంటే ప్రత్యేక హోదా లాంటివి వస్తాయి. అలాగే తానే చేసిన విభజన చట్టానికి కూడా న్యాయం చేసి అన్ని హామీలను నెరవేరుస్తుంది. ఇక ఏపీ ఆర్ధికంగా కునారిల్లిపోయింది.

కాంగ్రెస్ కి ఏపీలో పట్టం కడితే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఏపీని ముందుకు తీసుకుపోగలదు అన్న ఆలోచనలు అటు సగటు జనంతో పాటు మేధావుల్లో వస్తున్నాయి. సరిగ్గా రెండున్నరేళ్ల సమయం ఉంది.

కాంగ్రెస్ అధినాయకత్వం సరైన యువ నేతకు బాధ్యతలు అప్పగిస్తే ఎన్నికల వేళకు అధికార పార్టీ నుంచే పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కూడా అంటున్నారు. మొత్తానికి ప్రాంతీయ పార్టీల ప్రయోగాలతో విసిగిపోయిన జనం పాత కాంగ్రెస్ వైపే చూస్తున్నారా అంటే అదే నిజమని చెప్పాల్సి వస్తోంది.