Begin typing your search above and press return to search.

విద్యార్థిని సూటిప్రశ్నతో ఇబ్బంది పడ్డ బాబు

By:  Tupaki Desk   |   11 Feb 2017 5:06 AM GMT
విద్యార్థిని సూటిప్రశ్నతో ఇబ్బంది పడ్డ బాబు
X
ఊహించని పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురైంది. ప్రతిష్ఠాత్మకంగా సదస్సుల్ని ఏర్పాటు చేయటం.. గ్రాండ్ గా వాటిని పూర్తి చేయటం లాంటివి ఏపీ ముఖ్యమంత్రికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటిగా సదస్సుల్ని విజయవంతంగా నిర్వహించటం ఆయనకు మాత్రమే చెల్లింది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులున్నా.. వాటిని తట్టుకొని హడావుడి చేయటం బాబుకుమాత్రమే సరిపోతుందని చెప్పాలి. తాజాగా అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ సదస్సులో వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తొలిరోజున నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని బాబు దగ్గరుండి పర్యవేక్షించారు. తొమ్మిది రకాల అంశాలపై బృందాలుగా ఏర్పడి చర్చలు నిర్వహించాయి. వీటిని పర్యవేక్షించేందుకు బాబు స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని అడిగిన సూటిప్రశ్నకు బాబు ఇబ్బంది పడ్డారు. సమాధానం చెప్పలేక.. ఇలాంటి సదస్సులో ఇప్పుడా ప్రశ్నా అనటమేకాదు.. వేరే వేదిక మీద మాట్లాడదామంటూ మాట దాటేసిన వైనం కనిపించింది.

కర్నూలు జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని.. చంద్రబాబుతో ‘మీరు చెబుతున్న పథకాలేవీ అమలు కావటం లేదు’’ నిజానికి ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు.. మరిన్ని ప్రశ్నలతో సమస్య మూలాల్ని తెలుసుకోవటం.. వాటినిపరిష్కానన్న ధీమాను ఇవ్వటం లాంటివి చేస్తే బాగుండేది. కానీ.. చంద్రబాబు మాత్రం విద్యార్థిని సందేహాన్ని వదిలేసి.. ఇలాంటి వేదికల మీదా అలాంటి ప్రశ్నలా? అని వ్యాఖ్యానించటం గమనార్హం. తప్పులు ఎత్తి చూపటానికి ప్రత్యేక వేదికలు ఉంటాయా చంద్రబాబు?