Begin typing your search above and press return to search.

దీదీని త‌ప్పు ప‌డితే ఎంత పెద్ద శిక్షంటే..

By:  Tupaki Desk   |   18 Oct 2016 9:48 AM GMT
దీదీని త‌ప్పు ప‌డితే ఎంత పెద్ద శిక్షంటే..
X
ఇప్పుడున్న రోజుల్లో ఎవ‌రు ఎవ‌రినైనా విమ‌ర్శించే ప‌రిస్థితి. సోష‌ల్ మీడియా రాక‌తో.. ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల్ని ఓపెన్‌ గా పంచుకుంటున్నారు. సామాన్యుల‌తో పాటు.. కొంద‌రు సెల‌బ్రిటీలు కూడా త‌ర‌చూ స్పందించ‌టం చూస్తున్న‌దే. అయితే.. ఇలాంటివి ఎక్క‌డైనా చెల్లుతాయేమో కానీ.. దీదీ రాజ్యంలో మాత్రం న‌డ‌వ‌వ‌న్న విష‌యం తెలిసిందే. అయితే.. దీదీని త‌ప్పుప‌ట్టినా.. ఆమెను విమ‌ర్శిస్తే.. ఆమె పార్టీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతార‌న్న విష‌యం తాజాగా జ‌రిగిన ఒక ఘ‌ట‌న చెప్ప‌క‌నే చెబుఉతంది.

ఇటీవ‌ల జ‌రిగిన దుర్గా న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలో కోల్ క‌తాలో దుర్గాదేవి శోభాయాత్ర జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం భారీగా ఖ‌ర్చు చేసింది. దీనిపై క‌ల‌క‌త్తా వ‌ర్సిటీలో చ‌దువుతున్న ఒక పీజీ విద్యార్థినికి అస్స‌లు న‌చ్చ‌లేదు. త‌న అభిప్రాయాన్నిస్వేచ్ఛ‌గా ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ చేసింది. ఓప‌క్క రాష్ట్రంలో ప‌లు స‌మ‌స్య‌లు ఉండి.. పేద‌రికంతో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుంటే.. ఇలాంటి శోభాయాత్ర‌ల‌కు ఖ‌ర్చుచేస్తారా? అని సూటిగా ప్ర‌శ్నించింది. ఈ విమ‌ర్శ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు.

ఓప‌క్క ఫేస్ బుక్ లో ఈ వ్య‌వ‌హారంపై వాద ప్ర‌తివాద‌న‌లు జ‌రుగుతున్న వేళ‌.. కొంద‌రు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌ద్దుతుదారులు.. త‌మ అధినేత్రిని విమ‌ర్శించి పోస్ట్ చేసిన యువ‌తి ప్రొఫైల్ ను బ్యాన‌ర్ గా త‌యారు చేయించి.. కోల్ కతా వీధుల్లో ఏర్పాటు చేశారు. ఆమె ప్రొఫైల్ ను.. ఆమె పోస్టుల‌ను పెద్దపెద్ద హోర్డింగ్ లుగా మార్చ‌టంతో స‌ద‌రు యువ‌తి షాక్ తిన్న ప‌రిస్థితి. తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు చేసిన ప‌నిని ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు.

అయితే.. దీనిపై దీదీ మ‌ద్ద‌తుదారులు త‌మ‌దైన శైలిలో స‌మ‌ర్థించుకుంటున్నారు. సీఎంను విమ‌ర్శించే హ‌క్కు స‌ద‌రు యువ‌తికి ఉన్న‌ప్పుడు.. ఆ యువ‌తిని విమ‌ర్శించే హ‌క్కు త‌మ‌కూ ఉందంటూ చిత్ర‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు.
సీఎంను విమ‌ర్శించిన యువ‌తి ప్రొఫైల్ ను హోర్డింగ్‌ ల రూపంలో ఏర్పాటు చేయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇది స్థానికంగా ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఇదిలా ఉండ‌గా.. ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని విమ‌ర్శిస్తూ పెట్టిన పోస్టును ప్ర‌స్తావిస్తూ త‌న‌ను బెదిరిస్తున్న‌ట్లుగా స‌ద‌రు యువ‌తి చెబుతోంది. దీదీ మ‌ద్ద‌తుదారుల తీరు చూస్తే.. త‌మ అధినేత్రిని అయితే పొగిడేయాలే కానీ.. త‌ప్పు ప‌డితే మాత్రం బజారున ప‌డేస్తామ‌న్న‌ట్లుగా లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/