Begin typing your search above and press return to search.

మైనర్లే అతడి టార్గెట్ ..మాయమాటలతో మోసం, వీడియోలతో బ్లాక్ మెయిల్ !

By:  Tupaki Desk   |   22 March 2021 7:30 AM GMT
మైనర్లే అతడి టార్గెట్ ..మాయమాటలతో మోసం, వీడియోలతో బ్లాక్ మెయిల్  !
X
కరోనా మహమ్మారి విజృంభణతో విద్యార్థులంతా ఇప్పుడు ఆన్ లైన్ లోనే చదువుకుంటున్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు ఇప్పుడంతా ఆన్ లైన్ క్లాసులపై దృష్టి పెట్టారు. దీనితో అలా పాఠాల కోసం ఆన్ లైన్‌ లో వస్తున్న విద్యార్థులపై ఓ ప్రబద్ధుడు కన్నేశాడు. వారిని కల్లబొల్లి మాటలతో ముగ్గులోపి దింపుతున్నాడు. ఆన్‌ లైన్‌ క్లాసులను ఆసరాగా చేసుకుని, సోషల్‌మీడియా ద్వారా మైనర్లకు ఎర వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నాడు. అంతటితో ఆగకుండా, బ్లాక్ ‌మెయిలింగ్ ‌కు కూడా పాల్పడుతున్నాడు. ఇలాంటి ఓ కేటుగాడ్ని హైదరాబాద్ హయత్‌నగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే .. ఆ కేటుగాడు ఫేస్‌ బుక్, వాట్సాప్, ఇన్‌ స్ట్రాగామ్, షేర్‌ చాట్‌ వంటి యాప్స్‌ ను వినియోగించాడు. ఆకర్షణీయమైన ఫొటోలతో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశాడట. ప్రధానంగా మైనర్లను ఎక్కువగా టార్గెట్‌ గా చేసుకున్న సాయి తొలుత వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లు, ఆపై హాయ్‌ అంటూ మెసేజులు పెట్టేవాడట. వాటికి స్పందించిన వారితో పరిచయం పెంచుకుంటూ వారికి తియ్యటి మాటలు చెప్పేవాడట. ముఖ్యంగా ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులు చదవుతున్న వారితోనూ ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తీసుకువచ్చేవాడు. నీవు కాదంటే చచ్చిపోతా, నీవు లేకపోతే బతకలేను అంటూ వారిని పూర్తిగా తన ట్రాప్‌ లోకి తీసుకొచ్చేవాడు. ఇతడి చేష్టలకు భయపడకుండా ఎవరైనా ఎదిరు తిరిగితే ఇక వారి జోలికి వెళ్లేవాడు కాదు. అలా కాకుండా తన వల్లోపడిన వారిని ఏకాంతంగా గడిపే వరకు తీసుకువెళ్లి ఆ ఫొటోలు, వీడియోలు, సెక్స్‌ చాటింగ్స్‌ చేసేవాడు.

ఆ తర్వాత వాటిపై బెదిరింపులకు దిగుతూ డబ్బుల్ని వసూలు చేసేవాడు. సాయి మాయమాటల్లోపడిన బాలికలు తమ ఇళ్లల్లోనే చోరీలు సైతం చేశారని పోలీసులు చెప్తున్నారు. కొందరు నగదు, మరికొందరు బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి సాయికి అప్పగించారట . ఇతడి వ్యవహారం గుట్టురట్టయింది కూడా ఓ బాలిక చేసిన చోరీ ఘటనతోనే కావడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంలోమరికొందరూ నిందితులుగా ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయికి అతడి స్నేహితుల సాకారం కూడా ఉండి వచ్చని ఆరా తీస్తున్నారు. బాధితులు అంతా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు.