Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ క్లాస్ : స్మార్ట్ ఫోన్ లేదని విద్యార్థి ఆత్మహత్య ...
By: Tupaki Desk | 25 Jun 2020 8:50 AM GMTఈ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో స్కూల్స్ అన్ని కూడా మూతబడ్డాయి. లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చినా కూడా మిగిలినవి అన్ని ఓపెన్ అయినా కూడా స్కూల్స్ మాత్రం తెరుచుకోలేదు. కానీ, ఆన్ లైన్ లో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే, ఆన్ లైన్ చదువు తాజాగా ఓ ప్రాణం తీసింది. ఆన్ లైన్ చదువు కోసం స్మార్ట్ ఫోన్ లేదన్న మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అస్సాంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని చిరంగ్ జిల్లాకు చెందిన బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.పేద కుటుంబానికి చెందిన అతడు స్మార్ట్ ఫోన్ లేక చదువు కొనసాగించ లేకపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటనపై ఎస్పీ సుధాకర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ అతడిది నిరుపేద కుటుంబం. తల్లి ఉపాది కోసం బెంగళూరు పోయింది. తండ్రి ఏ పనీ చేయటం లేదు. ఆన్ లైన్ చదువుల కోసం స్మార్ట్ ఫోన్ అవసరమైంది. కానీ, తండ్రి అతడికి ఫోన్ కొనివ్వ లేకపోయాడు. ఆ మనస్థాపం తోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్క వారిని, మృతుడి మిత్రుల్ని విచారించాము. అతడి చావుకు కారణం ఆన్ లైన్ చదువు కొనసాగించలేకపోవటమేనని తేలింది అని వెల్లడించారు.