Begin typing your search above and press return to search.
ఆన్‌లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
By: Tupaki Desk | 8 Sep 2020 8:30 AM GMTకరోనా మహమ్మారి ధాటికి స్కూళ్ల అన్నీ మూతపడ్డాయి. విద్యా సంవత్సరం మొదలు కావడంతో ఆన్‌లైన్ క్లాసులతో పిల్లలకు విద్యాబోధన స్టార్ట్ చేశాయి స్కూల్స్. స్మార్ట్ ఫోన్ లేని నిరుపేద విద్యార్థి క్లాసులకు అటెండ్ కాలేక బలవన్మరణాకి పాల్పడ్డాడు. తెలంగాణ, జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరిని కలచివేసింది.
తెలంగాణ , జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల రాజేశం, శంకరవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. రాజేశం గీత వృత్తి తో పాటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. తల్లి బీడీలు చుడుతూ ఆసరాగా ఉంటోంది. చిన్న కుమారుడు సాయిరాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం మహమ్మారి విజృంభణ తో ఆన్ లైన్ తరగతులు కొనసాగుతుండటంతో స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక స్థోమత లేదని, ఇప్పుడు వద్దని తల్లిదండ్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు . దీంతో మనస్తాపం చెందిన సాయిరాం తమ పాత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.