Begin typing your search above and press return to search.
మొండి ట్రంప్ ఆఖరి అవకాశం చేజారింది
By: Tupaki Desk | 13 Dec 2020 4:03 AM GMTకిందపడినా పైచేయి తనదేనంటూ వాదించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన అధిక్యతను సాధించిన తర్వాత కూడా.. ఎన్నికల్లో తానే గెలిచానని.. ప్రత్యర్థులు మోసాలకు పాల్పడ్డారంటూ కోర్టులకు ఎక్కిన ట్రంప్ నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి పలు కోర్టుల్ని ఆశ్రయించిన ట్రంప్.. న్యాయస్థానాల ద్వారా తాను అనుకున్నది చేద్దామని తెగ ప్రయత్నించారు. కానీ.. ఆయన ఎత్తులు పారలేదు. ఇప్పటికే పలు కోర్టులు ఆయన దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేశాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఆయనకు చుక్కెదురైంది. నాలుగు కీలక రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని.. అక్కడి ఎన్నికల ఫలితాలు నిలిపివేయాలని టెక్సాస్ కు చెందిన రిపబ్లికన్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రిపబ్లికన్లు చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విధంగా రిపబ్లికన్ల పిటిషన్ ను కొట్టేయటం వారంలో ఇది రెండోసారి. దీంతో.. ఎన్నికల ఫలితాల్ని అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకోవాలన్న ట్రంప్ ఎత్తు చిత్తైంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చి చాలాకాలమే అయినా.. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో.. వివరాలు వెల్లడికాకుండా ఉండేలా చేస్తే.. అధ్యక్ష ఎన్నికను అడ్డుకోవచ్చన్న ప్లాన్ ట్రంప్ ది.
అయితే.. ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భిన్నంగా కోర్టులు స్పందిస్తున్న నేపథ్యంలో.. ఆయనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోమవారం ఎన్నికల ఫలితాల ప్రకటన విడుదలైన తర్వాత.. ఎలక్టోరల్ కాలేజీ సమావేశమై.. తదుపరి అమెరికా అధ్యక్షుడ్ని అధికారికంగా ఎన్నుకుంటుంది. దీంతో.. బైడెన్ అధ్యక్షుడిగా ఎంపిక కావటం లాంఛనంగా పూర్తి కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో జో బైడెన్ కు 306ఓట్లు.. ట్రంప్ నకు 232 ఓట్లు గెలుచుకోవటం తెలిసిందే.