Begin typing your search above and press return to search.
వైసీపీ యంగ్ మినిస్టర్ దూకుడుకు బ్రేక్ పడిందే...!
By: Tupaki Desk | 16 Feb 2023 6:00 PM GMTయువ మంత్రి.. పైగా ఉన్నత చదువు చదివి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నబీసీ నాయకుడు.. సీదిరి అప్ప లరాజు. గత ఎన్నికల్లో ఆయన తొలిసారి విజయం దక్కించుకుని.. అసూఎంబ్లీలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఆశీస్సులతో మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. పశుసంవర్థక శాఖ అధి కారిగా ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే.. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఈ స్వల్ప కాలంలోనే మంత్రిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎందుకు వచ్చిందనేది ప్రశ్న.
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో తనకు తిరుగులేదని భావిస్తున్న సీదిరికి ప్రతిపక్షాల కంటే కూడా.. సొంత పార్టీ నేతల నుంచి ఎన్నికల గండం ఎదురవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్ప టికే బాహాటంగా నాయకులు రోడ్డున పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమను పట్టించుకోలేదని చెప్పిన నేతలు.. ఇప్పుడు మంత్రి అనుచరులు.. తీవ్ర అవినీతి చేస్తున్నారని.. దీంతో పార్టీ పరువు పోతోందని చెబుతున్నారు.
అదేసమయంలో నియోజకవర్గంలో పాదయాత్ర చేసి మరీ.. మంత్రి అవినీతి చాటి చెబుతామని అంటు న్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించి తీరుతామని కానీ, సీదిరికి మాత్రం టికెట్ ఇవ్వొద్దని చెబుతున్నారు.
అయితే.. దీనిని పార్టీ అధిష్టానం లైట్ తీసుకుంది. అంతేకాదు.. ఇలా ఆరోపణ లు చేస్తున్నవారిని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. సరే.. ఈ పర్యవసానాలు ఎలా ఉంటాయనేది పక్కన పెడితే.. అసలు సీదిరికి నాయకులకు మధ్య ఎందుకు గ్యాప్ పెరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
కేవలం మంత్రి దూకుడు కారణంగానే నాయకులకు ఆయనకు మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. కానీ, దీని వెనుక ఆర్థికపరమైన కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కొందరు సీది రి కోసం ఖర్చు చేశారు.
అయితే.. వారికి తిరిగి ఇవ్వకుండా.. మంత్రి తప్పించుకుంటున్నారనే ప్రధాన అభియోగం. కానీ, తాను పనులు చేయించి పెట్టానని.. వాటికి.. వీటికి చెల్లయిపోయిందని మంత్రి అంటున్నారు. మొత్తంగా చూస్తే.. గత ఎన్నికల ఎఫెక్ట్ కారణంగానే మంత్రిపై ఇంత అసంతృప్తి పెరిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు.