Begin typing your search above and press return to search.
శ్రీవారి భద్రతకు సరికొత్త టెక్నాలజీ .. యాంటీ డ్రోన్ సిస్టమ్ తో కట్టుదిట్టమైన భద్రత !
By: Tupaki Desk | 24 July 2021 11:30 AM GMTకలియుగ వైకుంఠం అయిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమల ఆలయానికి దేశవిదేశాల నుంచి వస్తుంటారు. దీనితో తిరుమలకు కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాటు చేస్తుంటారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల ఆలయంపై ఉగ్రదాడి జరిగే ముప్పు ఉన్న కారణంగా , వాటిని తిప్పికొట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా డ్రోన్ జామర్ టెక్నాలజీని తిరుమల కొండపైన ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల జమ్మూలోని వైమానిక స్థావరంపై ఉగ్ర మూకలు డ్రోన్ల దాడి జరిపిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించింది. ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ టెక్నాలజీతో చెక్ పెట్టాలని నిర్ణయించింది. మొదటగా ఈ టెక్నాలజీని తిరుమల కొండపై ఉపయోగించనున్నారు. ఇలా దేశంలో ఒక ఆలయంపై యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే ప్రథమం.
ఈ టెక్నాలజీతో తిరుమల కొండకు మరింత భద్రత కల్పించనున్నారు. డీఆర్డీఓ తన యాంటీ డ్రోన్ టెక్నాలజీని జూలై 6న కర్ణాటకలోని కోలార్ వద్ద విజయవంతంగా ప్రదర్శించింది. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు శాఖల ప్రతినిధులతో పాటు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ చీఫ్ గోపీనాథ్ జెట్టి హాజరయ్యారు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఈ వ్యవస్థను తిరుమల కొండపై ఏర్పాటు చేసేందుకు మొత్తం రూ.25 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. త్వరలోనే డ్రోన్ జామర్ వ్యవస్థను తిరుమలకు తీసుకురానున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదకరమైన డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే టెక్నాలజీని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. డీ ఫోర్ డ్రోన్ వ్యవస్థగా పిలిచే దీనిద్వారా డ్రోన్ దాడుల ముప్పు నుంచి దేశాన్ని రక్షించుకోవచ్చని తెలుస్తుంది.
ఇక ఈ వ్యవస్థ నాలుగు కిలోమీటర్ల పరిధిలోని ప్రమాదకర డ్రోన్స్ ను గుర్తించే సెన్సార్లు, విధ్వంసం చేసే పరికరాలు ఉంటాయి. గతంలో అనేకమార్లు తిరుమల శ్రీవారి ఆలయం భద్రత విషయంలో వార్తలు వచ్చాయి. గతంలో ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిందని, అప్పట్లో పలువురు ఆందోళన సైతం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. డి-4 డ్రోన్ వ్యవస్థగా పిలిచే దీని ద్వారా డ్రోన్ దాడుల ముప్పు నుంచి దేశ రక్షణ కేంద్రాలను కాపాడుకోవచ్చు.
ఈ టెక్నాలజీ సహాయంతో నాలుగు కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై దాడి చేయవచ్చు. డి-4 డ్రోన్ వ్యవస్థలో సెన్సార్లు, డిటెక్షన్, జామింగ్, కౌంటర్‌మెషర్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు. డీఆర్డీఓకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈ పరికరాలను అభివృద్ధి చేసింది.ఈ టెక్నాలజీ ద్వారా డ్రోన్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, హోర్డ్వేర్ను నాశనం చేయవచ్చు. ఇక దేశ సరిహద్దులలోనూ ఇటీవల కాలంలో జమ్ము లోని వైమానిక స్థావరం పై జరిగిన డ్రోన్ దాడి, ఆ తర్వాత వరుసగా డ్రోన్స్ తిరుగుతున్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయానికి రక్షణకు సంకల్పించింది. టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆదేశాలతో ఈవో జవహర్ రెడ్డి యాంటీ డ్రోన్ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మరికొద్ది రోజుల్లో శ్రీవారి ఆలయంలో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది.