Begin typing your search above and press return to search.

కరోనా: ఏపీలో కఠిన నిబంధనలు అమలు.. అవి ఇవే

By:  Tupaki Desk   |   27 April 2021 5:30 AM GMT
కరోనా: ఏపీలో కఠిన నిబంధనలు అమలు.. అవి ఇవే
X
కరోనా వైరస్ విశృంఖలంగా వ్యాపిస్తున్న వేళ మహమ్మారి కట్టడికి ఏపీలోని జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మహమ్మారి ప్రబలకుండా ఇక పై రాష్ట్రంలో ఏ వేడుక నిర్వాహించేందుకైనా సరే 50 మందికి మాత్రమే అనుమతిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

ఇక ఏపీలో క్రీడా ప్రాంగణాలు, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్ ను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు అనిల్ సింఘాల్ చెప్పారు. అలాగే 50శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా, సినిమా హాళ్లను అనుమతిస్తున్నట్టు తెలిపారు.

అన్ని కార్యాలయాల్లో 50 గజాల దూరం పాటించాలని సింఘాల్ కోరారు. ఒకే కాల్ సెంటర్ ద్వారా ఆస్పత్రుల్లో పడకల కేటాయింపు, అడ్మిషన్లు జరగాలన్నారు. రెమిడెసివిర్ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టు అనిల్ సింఘాల్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 11 వేల రెమిడెసివిర్ వయల్స్ మాత్రమే ఉన్నాయని ఇవి సరిపోవన్నారు.

రాష్ట్రానికి 341 టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించిందని.. అది ఏమాత్రం సరిపోవడం లేదని వెల్లడించారు.