Begin typing your search above and press return to search.

భిక్షాటన చేస్తే కఠిన చర్యలు.. 20లక్షల జరిమానా.. 6 నెలల జైలు

By:  Tupaki Desk   |   15 April 2022 7:57 AM GMT
భిక్షాటన చేస్తే కఠిన చర్యలు.. 20లక్షల జరిమానా.. 6 నెలల జైలు
X
గల్ఫ్ దేశం యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఖ్యాతికి, పర్యాటక రంగానికి అడ్డంకిగా మారిన ‘భిక్షాటన’ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. యూఏఈలో భిక్షాటన చేస్తే ఇక వారికి కఠిన శిక్షలు పడనున్నాయి. ఇకపై ఆ దేశంలో ఎవరైనా బయటి దేశాల వారిని నియమించుకొని భిక్షాటన చేయిస్తే 1 లక్ష దిర్హమ్స్ అంటే మన కరెన్సీలో దాదాపు రూ.20.70 లక్షల జరిమానాతోపాటు ఆరునెలల వరకూ జైలు శిక్ష ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

అలాగే వీధుల వెంట భిక్షాటన చేసిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని ఆ దేశంలోని బిచ్చగాళ్లను హెచ్చరించింది. ఈ విసయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.

ఈ జరిమానా, జైలు శిక్షలను అమలు చేయడం ద్వారా యూఏఈలో భిక్షగాళ్లను నియంత్రించాలని అక్కడి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో దేశంలో భిక్షాటన చేసే వారిపై అక్కడి సర్కార్ ప్రతియేటా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల భారీ సంఖ్యలో బిచ్చగాళ్లను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా లక్ష జరిమానా.. 6 నెలల జైలు శిక్ష విధించడంతో ఇక వారిని నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

రంజాన్ సందర్భంగా యూఏఈలోనే కాదు.. చుట్టూ ఉన్న గల్ఫ్ దేశంలోనూ కఠినమైన ఆంక్షలు ఉంటాయి. రంజాన్ మాసంలో దానం చేయాలన్న దాన్ని బేస్ చేసుకొని భిక్షగాళ్లు భారీగా జమ అవుతుంటారు. అందుకే ఈ నిషేధాజ్ఞలు ఉంటాయి.

కువైట్ దేశంలో కూడా భిక్షాటన నిషేధం.. చుట్టూ ఉన్న బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ వంటి దేశాల్లోనూ అడ్డుకోవడం చట్టవ్యతిరేకం. పోలీసులు కేసులుపెట్టి జైలుకు పంపుతారు