Begin typing your search above and press return to search.

ప్రతీ మగాడి బీపీ వెనకా...

By:  Tupaki Desk   |   10 April 2015 4:00 AM IST
ప్రతీ మగాడి బీపీ వెనకా...
X
ప్రతీ మగాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుంది అంటారు... అంతే కాదు తాజాగా మరో విషయం కూడా తెలిసింది. ప్రతీ భర్త బీపీ వెనకా భార్య కూడా ఉంటుందట! ఈ విషయం తాజా అధ్యయనంలో తెలిసింది. ఆ విషయం తెలియడానికి అధ్యయనాలు ఎందుకు పెళ్లిచేసుకుంటే సరిపోతుంది కదా అనుకోకుండా... ఈ విషయం చదవండి.
సాదారణంగా చుట్టూ ఉండే పరిస్థితులు, తీసుకునే ఆహారం, వయసు, ఇతరాత్రా కారణాలవల్ల రక్తపోటు (బీపీ) వస్తుంటుంది! కానీ తాజా పరిశోదనల్లో తేలిందేమిటంటే... తరచూ ఒత్తిడికి లోనయ్యే భార్యల వల్ల భర్తలకు బీపీ ప్రమాదం పొంచి ఉంటుందట! వీటికి వివాహబంధాల్లోని లోపాలూ సహకరిస్తాయట. ఈ విషయంపై పరిశోదన చేసిన మిచిగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీనిని నిర్ధారించారు.
వ్యక్తిగత కారణాల వల్లే బీపీ వస్తుందా లేక జీవిత భాగస్వామి ఒత్తిడి కూడా తోడవుతుందా అనే విషయాలపై పరిశోధనలు చేసిన వీరు... రెండొది అతి ముఖ్యమైన కారణం అని తెలిపారు. అంతేనా... భర్త జీవనకాలంపైనా కూడా ఈ ప్రభావం ఉంటుందట! అంటే... భార్య ఎంత ఒత్తిడికి లోనైతే అంత ప్రభావం భర్తపై ఉంటుందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం!