Begin typing your search above and press return to search.

భాగస్వామి తోడుంటే ఒత్తిడి, నొప్పికి చెక్

By:  Tupaki Desk   |   26 Aug 2019 5:10 AM GMT
భాగస్వామి తోడుంటే ఒత్తిడి, నొప్పికి చెక్
X
కాలంతో పోటీపడి పరిగెత్తే సమాజం మనది.. దాన్ని అందుకోపోతే వెనుకబడి పోతాం.. అందుకే నేటి యువత పరిగెత్తుతూనే ఉంటారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమిస్తూనే ఉంటారు. ఎక్కడ ఆగితే వెనుకబడి పోతామోనన్న భయం వారిని వెంటాడుతుండడంతో ఒత్తిడి, పనితాలుకా నొప్పులు బాధిస్తాయి.

అయితే ఒత్తిడి- నొప్పులు మన శృంగార భాగస్వామి (భార్య లేదా ప్రియురాలు) తోడుంటే అస్సలు మనపై ప్రభావం చూపవని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాలో వాషింగ్టన్ పరిశోధకులు నిగ్గు తేల్చిన నిజమిదీ..

అమెరికన్ పరిశోధకులు తాజాగా 48 జంటలకు సంబంధించిన ఒత్తిని, నొప్పికి కారణమైన సున్నితత్వంపై పరిశోధన చేశారు. ప్రతీ జంటలోని ఇద్దరిని ఒంటరిగా- భాగస్వామి సమక్షంలో పరిశీలించారు. ఇందులో భాగస్వామి పక్కన ఉండగా వారిలో ఒత్తిడి- నొప్పి తీవ్ర తగ్గిందని కనుగొన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇవి బాగా పెరిగాయని గుర్తించారు.

భాగస్వామితో ఎక్కువగా మాట్లాడడం..తాకడం.. శృంగారం చేయడం వల్ల వారిలో ఒత్తిడి, నొప్పి తగ్గిపోయిందని పరిశోధకులు తేల్చారు. భాగస్వామి పక్కన లేని వారిలో ఈ నొప్పి, ఒత్తిడి తగ్గలేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనిషిని దహించే ఒత్తిడి, నొప్పులు పోవాలంటే మీ భాగస్వామిని పక్కన ఉంచుకోవాలని పరిశోధకులు తేల్చారు.