Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిని చంపిన వీధి కుక్కలు!
By: Tupaki Desk | 21 Feb 2023 1:32 PM GMTహైదరాబాద్ లోని అంబర్‌పేట ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు కరిచి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం పని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. అతనికి ప్రదీప్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. గంగాధర్ అతడిని తాను పనిచేసే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో ప్రదీప్ రోడ్డు మీద ఆడుకోవడానికి వెళ్లాడు. గంగాధర్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అయితే ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు ఒకటి నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసింది.
చిన్నారి భయాందోళనకు గురై తన తండ్రి ఉన్న పరుగెత్తడం ప్రారంభించాడు. కానీ కుక్కలు అతనిని వెంటాడాయి. చిన్నారి శరీరాన్ని వాటి వాడి పళ్లతో చీల్చేశాయి. దీంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఇది చూసిన గంగాధర్ తన కుమారుడిని రక్షించుకోవడానికి వెళ్లినా అప్పటికే ఆలస్యమైపోయింది.
చిన్నారి ప్రదీప్ కు తీవ్ర రక్తస్రావం అయింది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఈ ఘటనలో తండ్రిదే తప్పని నెటిజన్లు తప్పుబడుతున్నారు. తన కొడుకును మెయిన్ రోడ్డుపై వదిలిపెట్టినందుకు కొంతమంది నెటిజన్లు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరికొంత మంది రోడ్లపై ప్రమాదకరంగా మారుతున్న వీధి కుక్కలను నగరపాలక సంస్థ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చిన్నారి ప్రాణం మాత్రం కుక్కల దాడికి బలైపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.