Begin typing your search above and press return to search.

ఇంత నిర్లక్ష్యమా? ఆస్పత్రిలో యువతి మృతదేహాన్ని కొరుక్కుతిన్న కుక్క

By:  Tupaki Desk   |   27 Nov 2020 12:30 PM GMT
ఇంత నిర్లక్ష్యమా? ఆస్పత్రిలో యువతి మృతదేహాన్ని కొరుక్కుతిన్న కుక్క
X
దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోజురోజుకూ వైద్య అధికారుల నిర్లక్ష్యం పెరిగిపోతోంది. వైద్య అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అధికారుల బాధ్యతా రాహిత్యంతో రోజూ ఎక్కడో ఒక చోట తప్పులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం జరిగింది. మార్చురీలో ఉంచిన ఓ యువతి మృతదేహాన్ని ఓ వీధి కుక్క కొరుక్కుని తీనడానికి ప్రయత్నించింది. దీనికి సంబంధించి సీసీ టీవీ పుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ కావడంతో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువతిని అంబులెన్స్ లో సంభాల్ జిల్లా ఆస్పత్రికి తీసుకు రాగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించకుండా తెల్లటి వస్త్రం కప్పి ఆసుపత్రి ప్రాంగణంలోనే స్ట్రెచర్ పై పడుకోబెట్టి అలాగే వదిలేశారు.వైద్య సిబ్బంది కళ్ళు కప్పి హాస్పిటల్ లోకి ప్రవేశించిన ఓ వీధి కుక్క యువతి మృతదేహాన్ని కొన్ని నిమిషాల పాటు కొరుకుతూ కనిపించింది. ఇదంతా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో నమోదు కావడంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది.

ఈ విషయమై మృతురాలి తండ్రి చరణ్ సింగ్ మాట్లాడుతూ గాయపడ్డ తమ కుమార్తెను ఆసుపత్రికి తీసుకురాగా గంటన్నర పాటు ఒక వైద్యుడు కూడా అందుబాటులో లేడని, వైద్యులు వచ్చేలాగా తమ కుమార్తె ప్రాణాలు వదిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే తమ కుమార్తె ప్రాణం దక్కేదని విలపించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సమాజ్ వాదీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పని తీరుపై తీవ్ర విమర్శలు చేసింది. ఓ వీధి కుక్క ఆస్పత్రిలోకి చొరబడ్డ వైద్య సిబ్బంది గమనించే స్థితిలో లేరని విమర్శించింది.అయితే వైద్యాధికారులు మాత్రం ఆ యువతి మృతి చెందినట్లు నిర్ధారణ కాగానే మృతదేహాన్ని అప్పగించినట్లు చెబుతున్నారు.