Begin typing your search above and press return to search.

'గోవా' పై పాగా కోసం మొదలైన కసరత్తు..

By:  Tupaki Desk   |   4 Nov 2021 6:38 AM GMT
గోవా పై పాగా కోసం మొదలైన కసరత్తు..
X
దేశ దిశ మార్చే పార్లమెంట్ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే అంతకుముందే పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి సవాల్ గా మారనున్నాయి. గత సంవత్సరం ఐదురాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే గెలుచుకోగలిచింది. దీంతో మోడీ గ్రాఫ్ తగ్గిపోయిందని, ఇక బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని ప్రచారం చేస్తున్నారు. అయితే పార్టీ నాయకులు మాత్రం ఒకసారి ఛాన్స్ మిస్సాయినా... మరోసారి అలాంటి మిస్టేక్స్ చేయమని వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉత్తరప్రదేశ్, గోవార రాష్ట్రాల ప్రభుత్వాల గడువు తీరనుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఆ పార్టీకి సవాల్ గానే మారనున్నాయి.

మొదటి ఐదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురులేకుండా పోయింది. మోడీ మానియాతో ఎన్నికలు ఏవైనా విజయం కమలందే అన్నట్లుగా సాగింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నా కలిసి రావడం లేదు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో స్వయంగా మోడీ పర్యటించినా ఆయన పాచిక పారలేదు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కమలం నాయకులకు గుబులు పుట్టిస్తున్నాయి.

గోవా రాష్ట్రం విషయానికొస్తే ఇక్కడ దేశంలోనే అతి చిన్న రాష్ట్రం. కానీ పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ప్రస్తుతం బీజేపీకి 28 మంది సభ్యుల బలం ఉండగా కాంగ్రెస్ లో నలుగు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రాకపోయినా అధికారంలో కూర్చుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ కేవలం 13 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రభుత్వం ఏర్పరుచుకుంది. బీజేపీకి మెజారిటీ సీట్లు రాకపోయినా ప్రభత్వం ఏర్పాటుకు గవర్నర్ మృదుల సిన్హా ఆహ్వానించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

చిన్న రాష్ట్రంగా పేరున్నా గోవాలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేల మంది లోపే ఓటర్లుంటారు. దీంతో రెండు పార్టీల మధ్య కొద్ది తేడాతోనే విజయం సాధిస్తారు. దీంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. 5 నెలల గడువు ఉండగానే ఆ పార్టీ నాయకులు నియోజకవర్గాల పర్యటనలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో తమకు అధికారం దక్కకుండా చేసిన పార్టీని దెబ్బకొట్టాలతనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈసారి బాగానే పనిచేస్తోంది. ఆ పార్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీ ఇప్పటికే గోవాలో పర్యటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు ఆరాటపడుతున్నాడు.

కాంగ్రెస్ తో పాటు ఆప్, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్ పార్టీ, మహారాష్ట్ర వాది గోమాంతక్ పార్టీ, ఇతరులు పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఆప్ కు ఒక్క సీటు రాలేకపోయినా ఓట్లు బాగానేపడ్డాయి. ఇక శివసేన సైతం ఇక్కడ పోటీకి సై అంటోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మూడు రోజుల పాటు గోవాలో పర్యటించే బెంగాల్ లో బీజేపీకి పట్టిన గతే పట్టిస్తామని శపథం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజీపీకి కీలక నేత మనోహర్ పారికర్ లేకపోవడం ఇక్కడ మైనస్ గా మారింది. 2019లో ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న ప్రమోద్ సావంత్ ఇప్పటికే పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.