Begin typing your search above and press return to search.
మోడీ కోర్టులో బంతిని తోసిన చంద్రబాబు
By: Tupaki Desk | 2 Sep 2022 7:30 AM GMTదారిన పోయే వాటిని మీదేసుకోవటంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించినోళ్లు లేరన్న మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. సంబంధం లేని అంశాల మీద ఆయన ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్న సలహాను తరచూ ఇస్తుంటారు ఆయన్ను.. ఆయన పార్టీని విపరీతంగా అభిమానించేవారు.
అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మీడియాతో మాట్లాడే విషయంలో ఆయన తీరు మిగిలిన అధినేతలకు భిన్నంగా ఉంటుందని చెబుతారు. మీడియాకు ఎక్కువగా అందుబాటులో ఉండటం.. ప్రతి విషయం మీద గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించి.. వాటి గురించి తన స్పందనను తెలియజేయటం ద్వారా ప్రత్యర్థుల చేతికి ఆయన అస్త్రాల్ని ఇస్తుంటారన్న విమర్శ ఉంటుంది.
సక్సెస్ ఫుల్ రాజకీయ అధినేతలుగా ఇప్పుడు కనిపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కానీ.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కానీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ చాలా తక్కువగానే స్పందించటం.. మీడియాకు వీలైనంత దూరంగా ఉండటం తెలిసిందే. నిజానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిగా ఉండేదన్న మాట వినిపించేది. కానీ.. ఆయన మాత్రం మాట్లాడుతూనే ఉంగటం తెలిసిందే. అలాంటి చంద్రబాబు కీలకమైన వేళ.. తాజాగా మాత్రం తన తీరుకు భిన్నంగా స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.
ఒక జాతీయ మీడియా సంస్థకు చెందిన చానల్ లో ఎన్డీయేలోకి త్వరలోనే టీడీపీ చేరనుందన్న కథనాన్ని పబ్లిష్ చేయటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన ఈ కథనంపై రాజకీయ వర్గాల్లోనూ.. మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబును నేరుగా అడిగేశారో రిపోర్టర్. దానికి ఆయన ఆచితూచి అన్నట్లు రియాక్టు అవుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని గుర్తు చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాల్ని చూస్తామన్నారు.
ఎన్డీయేలోకి టీడీపీ అన్న ప్రచారం చేసిన వారే తాము చేరతామా? లేదా? అన్న విషయాన్ని చెప్పాలన్న బాబు వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తాజా వ్యాఖ్యను చూస్తే.. ఏపీనే తనకు ముఖ్యమని.. మిగిలినవేమీ తనకు అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి.
తన వరకు తాను స్పష్టంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తూనే.. తదుపరి స్పందన మోడీ పరివారానిదే అన్న విషయాన్ని తెలియజేసేలా ఆయన సమాధానం ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఎన్డీయేలోకి టీడీపీ చేరనుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఇవ్వకుండా.. మోడీషాల రియాక్షన్ ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకునేలా ఆయన కామెంట్ ఉందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.