Begin typing your search above and press return to search.
జనం తిన్నప్లేట్లను కడగాలి.. మూడ్రోజులు బయటకు రావొద్దు.. వింత పెళ్లి సంప్రదాయాలు!
By: Tupaki Desk | 28 Jan 2021 1:30 AM GMTప్రతీ మనిషి జీవితంలో మూడు ప్రధాన ఘట్టాలుంటాయి. పుట్టుక, చావు.. మొదటి, చివరి అంశాలైతే.. అత్యంత అద్బుతమైన నడుమ ఘట్టమే పెళ్లి. జననం మనిషి చేతుల్లో ఉండదు.. మరణం ఎవరికీ చెప్పి రాదు. ఇక తనకు తెలిసి, తాను కోరుకున్న ప్రకారం జరిగే ఆనందకరమైన విషయం పెళ్లి. అందుకే.. ఈ సంతోషకరమైన సమయం ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని అందరూ తాపత్రయపడుతుంటారు. అందుకే.. తమకు సాధ్యమైనంత హంగామాగా వివాహ వేడుకను జరుపుకుంటారు.
అయితే.. పెళ్లి తంతులో ఒక్కో దేశంలో.. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నట్టే.. వారి ఆచారాల్లోనూ తేడాలుంటాయి. మన దేశంలో మతాలు, కులాలు, వాటిలోని వర్గాల ప్రకారం.. భిన్నమైన సాంప్రదాయాల్లో పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇందులో మనకు కొన్ని పద్ధతులు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు ప్రపంచ దేశాల్లోని అన్ని సంప్రదాయాలూ తెలిసే ఛాన్స్ లేదు. కాబట్టి.. పలు దేశాల్లోని విచిత్రమైన పెళ్లి పద్ధతులను ఇప్పుడు చూద్దాం.
నార్వే..
నార్వేలో వివాహం రోజున ప్రత్యేకంగా తయారు చేసిన టవరింగ్ కేకును వడ్డిస్తారు. దీన్ని ఆల్మండ్ ఐస్ కేకు రింగులతో, ఒక కోన్ ఆకారంలో సిద్ధం చేస్తారు. ఈ కేకు మధ్యభాగంలో ఒక వైన్ బాటిల్ ఉంటుంది. వధూవరులతో పాటు పెళ్లికి వచ్చినవారు ఆ వైన్ తాగుతూ కేక్ తింటారు. ఈ పద్ధతి లేకుండా పెళ్లి జరగదు.
ఇండోనేషియా..
ఈ దేశంలోని బోర్నియోలో, పెళ్లి తరువాత వధూవరులను మూడు రోజుల పాటు ఒకే గదిలో ఉంచుతారు. ఈ సమయంలో వారు బాత్‌రూంకు వెళ్లేందుకు వీలుండదు. ఇలా చేయడం వల్ల నవ దంపతుల మధ్య బంధం బలపడుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఇలా చేయడం వల్ల వారి మూత్రాశయం కూడా బలోపేతం అవుతుందని వారు నమ్ముతుంటారు.
గ్రీస్..
గ్రీస్ దేశంలో పెళ్లికి ముందు వధువు బంధుమిత్రులు వరుడికి షేవింగ్ చేస్తారు. షేవింగ్ చేసిన తరువాత, తన అత్త అతడికి తేనె, బాదం కలిపి తినిపించాలి. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు మొదలవుతాయి.
జపాన్..
జపాన్ అమ్మాయిలు పెళ్లిరోజున షింటో ఉత్సవం జరుపుకుంటారు. ఆరోజు వారు తల నుంచి కాళ్ల వరకు తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు. పెళ్లి కూతురు మేకప్ కూడా వైట్ కలర్లోనే ఉండాలి. ఆ డ్రెస్‌కు తలను కప్పే హుడ్ ఉంటుంది. దీన్ని 'త్సునోకుషి' అంటారు. తెలుపు రంగు అనేది.. వధువు కన్యత్వాన్ని సూచిస్తుంది. దుస్తులకు ఉండే హుడ్, కాబోయే అత్తగారిపై అసూయ అనే కొమ్ములను పెరగనీయకుండా చూస్తుందని జపనీస్ నమ్ముతారు.
ఫిజీ..
ఫిజీ దేశంలో వరుడు, కాబోయే మామగారి వద్దకు వెళ్లి, తన కూతురిని ఇచ్చి పెళ్లిచేయమని అడగాలి. అలా అడిగినప్పుడు అతడు కాబోయే మామగారికి ఒక తిమింగలం దంతాన్ని కానుకగా ఇవ్వాలి.
జర్మనీ..
జర్మన్ వధూవరులు పెళ్లి తరువాత, అతిధులు తిని పడేసిన ప్లేట్లను కడిగి, వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులను నిరోధించవచ్చని అక్కడి ప్రజలు భావిస్తారు. అందుకే.. ప్రతీ దంపతులు ఇలా చేస్తారు.
చెక్ రిపబ్లిక్
ఈ దేశంలో వధూవరుల మంచంపై ఒక శిశువును ఉంచుతారు. పెళ్లి అయిన తరువాత, అతిధులు వారికి పప్పుధాన్యాలు, బియ్యం, బఠానీలతో స్నానం చేయిస్తారు. ఇలాంటి పద్ధతులు సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తాయని వారు విశ్వసిస్తారు.
గ్వాటెమాల..
గ్వాటెమాలలో పెళ్లి తరువాత ఒక సిరామిక్ బౌల్ లో బియ్యం, ఇతర ధాన్యాలు, పిండి పోసి వరుడికి ఇస్తారు. దాన్ని పగలగొట్టమని అతడి తల్లి ఆదేశిస్తుంది. ఇలా చేయడం ద్వారా వధూవరులకు సౌభాగ్యాన్ని తీసుకువస్తాయని నమ్ముతారు.
ఫ్రాన్స్..
ఇక, ఫ్రాన్స్‌లో పెళ్లి రిసెప్షన్ తరువాత వధూవరులు షాంపైన్, చాక్లెట్లను టాయిలెట్ బౌల్‌లో తినాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మొదటి రాత్రికి ముందు వారిద్దరి మధ్య బంధం బలోపేతమవుతుందని భావిస్తారు. కానీ ఈ ఆచారం ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు.
భారతదేశం..
మన దేశంలో చాలా సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి రోజున పెళ్లికూతురు చెల్లెళ్లు వరుడి చెప్పులను, ఇతర వస్తువులను దాచిపెట్టే సంప్రదాయం ఉంది. ఆ చెప్పులను తిరిగి ఇవ్వడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఈ సమయంలో తమ బావగారిని ఆటపట్టిస్తారు. ఈ వేడుకను జూటా చుపాయి అంటారు. రెండు కుటుంబాల బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి మార్గమని ప్రజలు భావిస్తారు. ఇలాంటి సంఘటనలు పెళ్లిలో వినోదాన్ని పంచుతాయి.