Begin typing your search above and press return to search.

కావ్య.. పెళ్లాడవా? సన్ రైజర్స్ ఓనర్ కు వింత ప్రతిపాదన

By:  Tupaki Desk   |   20 Jan 2023 9:30 AM GMT
కావ్య.. పెళ్లాడవా? సన్ రైజర్స్ ఓనర్ కు వింత ప్రతిపాదన
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్, సౌతాఫ్రికా టి20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్.. పేరులోని సామీప్యమే చెబుతోంది రెండింటి ఓనర్ ఒకరేనని.. ఇంకేం? ప్రశ్నలు ప్రారంభమవుతాయి కావ్య మారన్ ఎక్కడ అని..? సన్ రైజర్స్ ఓనర్ గా ఆమె ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ లో ఆ ఫ్రాంచైజీ ఒడిదొడుకులను వదిలేస్తే.. కావ్య మారన్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు. యువ వ్యాపారవేత్త అయిన ఆమె గురించి అభిమానులకు ప్రత్యేక పరిచయమే అక్కర్లేదు. మ్యాచ్ ఉందంటే వాలిపోతుంది కావ్య మారన్..

తమ ఫ్రాంచైజీ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా తప్పక హాజరవుతుంది. అఫ్ కోర్స్ ప్రీతి జింటా, నీతా అంబానీ, జుహీ చావ్లా ఇలా ఫ్రాంచైజీ ఓనర్లంతా చేసే పని ఇదే. దీనికి కావ్య కూడా ఏమీ మినహాయింపు కాదు. ఐపీఎల్ సందర్భంగా కావ్య హాజరైన మ్యాచ్ లో సందడి వేరేలా ఉంటుంది. హైదరాబాద్ అభిమానులు అటు మ్యాచ్ ను ఇటు కావ్యను చూస్తూ ఉంటారు. ఈ మేరకు ఆమె ఐపీఎల్ కు సంబంధించిన ఈవెంట్‌ లో పాల్గొంటే అక్కడ సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్‌ అవుతుంటాయి.

నెటిజన్లలో ఆమెకున్న క్రేజ్‌ అలాంటిది. దక్షిణాఫ్రికాలోనూ క్రేజ్ సన్ రైజర్స్ యాజమాన్యం.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ జట్టును కొనుగోలు చేసింది. భారత లీగ్ కు పోటీగానా అన్నట్లు, తమకూ ఓ లీగ్ ఉండాలన్నట్లు ప్రారంభమైన ఈ లీగ్ లో చాలా జట్లకు ఐపీఎల్ ఫ్రాంచేజీ ఓనర్లే యజమానులుగా ఉన్నారు. జనవరి 10న మొదలైన ఈ టోర్నీలో సన్‌రైజర్స్‌ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. దీంతో ఆ మ్యాచ్ లకు కావ్య హాజరైంది. దీంతో తాజాగా ఈమె పేరు మరోసారి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.

ఆ లీగ్ లో రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ దక్షిణాఫ్రికా లీగ్ లో గురువారం రాజస్థాన్ ఫ్రాంఛైజీకి కూడా ఓ జట్టు ఉంది. దాని పేరు పర్ల్‌ రాయల్స్‌. పర్ల్ లో గురువారం ఆ జట్టుతో సన్ రైజర్స్ ఈస్టర్న్ పోటీ పడింది. ఈ మ్యాచ్‌ను కావ్య ప్రత్యక్షంగా వీక్షించింది. స్టాండ్స్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరిచింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు ఆమెకు ప్రపోజ్‌ చేయడం విశేషం. పెళ్లాడతావా కావ్య..? "కావ్య మారన్‌.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అంటూ హార్ట్‌ సింబల్‌ జత చేసిన ప్లకార్డును పట్టుకుని తన మనసులోని కావ్యతో పాటు అక్కడున్న వాళ్లందరి ముందు బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్‌ త అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇక ఈ వీడియోపై స్పందించిన సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "ఎంత ధైర్యం? మా మేడమ్‌కే లైన్‌ వేస్తావా? ఆమెకు దూరంగా ఉండు...

లేదంటే నీ సంగతి చూస్తాం! దేమైనా సౌతాఫ్రికాలో కూడా మీ డామినేషన్‌ సూపర్‌ మేడమ్‌" అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. "మేడమ్‌ సార్‌.. మేడమ్‌ అంతే" అంటూ రకరకాల మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా సన్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు, మీడియా మొఘల్స్‌లో ఒకరైన కళానిధి మారన్‌ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్‌ జట్ల సహ యజమానిగా ఉన్న 30 ఏళ్ల కావ్య.. సన్‌ టీవీ మ్యూజిక్‌, ఎఫ్‌ఎం చానెల్స్‌ వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.