Begin typing your search above and press return to search.
ప్రియుడ్ని సొంతం చేసుకోవటం కోసం కూతురితో అంత నాటకం ఆడించిందట!
By: Tupaki Desk | 26 Aug 2020 11:30 PM GMTఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న నేరాల్ని వింటుంటే.. వణుకు పుట్టేలా మారుతున్నాయి. వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీయటం తెలిసిందే. తనతో సంబంధం ఉన్న కుర్రాడికి పెళ్లి జరగటాన్ని జీర్ణించుకోలేని ఒక మహిళ ఆడిన నాటం గురించి వివరాలుతెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. బిహార్ లోని నలందాలో చోటు చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది.
తాజాగా ఒక యువకుడి పెళ్లి జరుగుతుండగా.. ఒక అమ్మాయి వచ్చి.. తనను ప్రేమించి మోసం చేసి.. వేరే అమ్మాయిని పెళ్లాడుతున్నట్లుగా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పెళ్లి మండపానికి తీసుకెళ్లారు. పెళ్లి చేసుకుంటున్న అతడ్ని చూసిన ఆ అమ్మాయి ఆగమాగం చేస్తే.. ఆ పెళ్లి కొడుకు బిత్తర పోయాడు. తనను ఆ అమ్మాయి ని ప్రేమించటం ఏమిటి? తనతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు.
దీంతో సందేహం వచ్చిన పోలీసులు.. ఆ కుర్రాడిని విచారించటం షురూ చేశారు. కొత్త విషయాలు బయటకు రావటమే కాదు.. పోలీసులకు సైతం విస్మయానికి గురి చేసింది. తనకు ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదని.. ఆ అమ్మాయి తల్లి తో తనకు వివాహేతర సంబంధం ఉందని యువకుడు చెప్పాడు. దీంతో.. ఆ అమ్మాయిని పోలీసులు విచారించ గా.. కొత్త విషయాలు బయటకు వచ్చాయి. తన తో సంబంధం ఉన్న యువకుడికి పెళ్లి కావటాన్ని జీర్ణించుకోలేని అమ్మాయి తల్లి.. తన కూతురి చేత ఇలా నాటకాన్ని ఆడించినట్లుగా తేలింది. తన కూతురితో ఫిర్యాదు చేయిస్తే.. పెళ్లి ఆగుతుందని మాత్రమే ఆలోచించిన ఆమె.. తీగ తగిలితే.. డొంక మొత్తం లాగుతారన్న విషయాన్ని ఊహించలేకపోయింది. ఈ విచిత్ర పరిణామానికి పోలీసులు సైతం అవాక్కు అయ్యారు.ఈ బరితెగింపు ఏందిరా బాబు అంటూ తల పట్టుకుంటున్నారట.