Begin typing your search above and press return to search.

డేటింగ్ చేసి.. సెక్స్ డాల్ ను పెళ్లాడాడు

By:  Tupaki Desk   |   30 Jan 2021 8:30 AM GMT
డేటింగ్ చేసి.. సెక్స్ డాల్ ను పెళ్లాడాడు
X
పిచ్చ పీక్స్ అన్న మాట సరిగ్గా సరిపోతుందేమో. తాజా ఉదంతం మనకు చాలా కొత్తే కానీ.. కొన్ని దేశాల్లో ఇలాంటివి ఇప్పటికే మొదలయ్యాయి. మనుషులపై నమ్మకం తగ్గిపోవటం..కల్పనను నమ్మటం.. లేనిది ఉన్నట్లుగా ఫీలైపోవటం.. దాన్నే జీవితం అనుకోవటం ఈ మధ్యన ఎక్కువ అవుతుంది. దానికి పరాకాష్ఠగా తాజా ఉదంతాల్ని చెప్పుకోవాలి. హాంకాంగ్ కు చెందిన 36 ఏళ్ల యువకుడు తాజాగా ఒక సెక్స్ డాల్ ను పెళ్లాడిన వైనం సంచలనంగా మారింది.

పెళ్లికి ముందు కొంతకాలం దాన్ని డేటింగ్ చేసిన అతను.. డేటింగ్ సమయంలో ఒక్కసారి కూడా దానితో సెక్సు చేయలేదని.. ఆ మాటకు వస్తే.. అసభ్యంగా తాకలేదని చెబుతున్నాడు. ఈ చిత్రమైన ఉదంతంలోని వ్యక్తి పేరు జీ తియాన్ రాంగ్. తల్లిదండ్రులతో కలిసి ఉండే ఇతగాడికి గతంలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ.. వారు తనతో కంటే మొబైల్ తో ఎక్కువగా గడిపేవారు. దీంతో.. తాను విసిగిపోయినట్లు చెబుతున్నారు.

ఇప్పుడీ సెక్స్ డాల్ తననే చూస్తుంటుందని చెబుతాడు. దానికి ఖరీదైన వస్తువుల్ని గిప్టుగా ఇస్తుంటాడు. ఆ బహుమతుల జాబితాలో ఐఫోన్ 12తో పాటు.. ఆ బొమ్మకు ఇప్పటివరకు 20 జతల ఖరీదైన బట్టలతో పాటు.. 10 జతల షూస్ ఉన్నాయి. ఇక.. ఆ బొమ్మ పేరు మోచీ. దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకిలా అని అతడ్ని ప్రశ్నిస్తే.. తనకు గతంలో నిజమైన అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ గా ఉండేవారని.. ఇప్పుడు తనకు బొమ్మలే నచ్చుతున్నాయని చెబుతున్నాడు. ఆ బొమ్మ అంటే తనకు చాలా గౌరవమని చెప్పిన అతను.. తనతో కంపెనీ కోసమే దాన్ని కొనుక్కున్నట్లు చెబుతున్నాడు.

ప్రతి రోజూ తన పక్కనే పడుకుంటుందని.. రోజూ దానికి స్నానం చేయించటం.. కొత్త బట్టలు తొడుగుతుంటానని.. ముఖానికి పౌడర్ రాయటం చేస్తుంటాడని చెబుతున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ఆ బొమ్మను చూసినంతనే తాను ఆకర్షణకు గురయ్యానని.. అయితే.. అప్పట్లో దాని ధర రూ.9లక్షలు (మన రూపాయిల్లో) ఉండటంతో కొనలేకపోయినట్లు చెబుతున్నాడు. రెండేళ్ల క్రితం ఆన్ లైన్ లో ఈ బొమ్మను చూసి కొన్నట్లు చెప్పారు. ఇదంతా చూస్తే.. ఈ డిజిటల్ యుగంలో మనిషి సహజసిద్ధమైన వాటి కంటే కూడా.. క్రత్రిమమైన వాటికే ఎక్కువగా అలవాటు పడిపోతున్నాడన్న భావన కలుగక మానదు.