Begin typing your search above and press return to search.

జాదూ ఫ్యామిలీ..రెండో భార్య నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్!

By:  Tupaki Desk   |   2 Sept 2020 9:15 AM IST
జాదూ ఫ్యామిలీ..రెండో భార్య నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్!
X
ఆమెను భర్త దారుణంగా మోసగించడంతో అతడికి దూరమైంది. ఒంటరిగా జీవిస్తోన్న ఆమెకు సాంత్వన పేరుతో మరో వ్యక్తి దగ్గర అయ్యాడు. పెళ్లి చేసుకుని ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం కాజేసి..ఇంకా డబ్బు ఆశ చావక ఏకంగా ఆమె నగ్న వీడియోలతో బెదిరింపులకు దిగాడా ఆ నీచుడు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించింది. విజయవాడకు చెందిన అకౌంటెంట్ గా పనిచేసే ఓ మహిళను భర్త మోసగించాడు. దీంతో ఆమె అతడికి దూరమై వేరే జీవితం మొదలు పెట్టింది. ఆమె దగ్గర డబ్బులున్నట్లు తెలుసుకున్న శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి.. ఆమెకు దగ్గరై కష్టాలను పంచుకునేవాడు.

ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు అని చెప్పి రూ. ఆరు లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నాడు. వివిధ అవసరాలకని చెప్పి ఆమె దగ్గర ఉన్న అరకిలో బంగారం, రూ. 14 లక్షలు తీసుకున్నాడు. అయినా అతడి డబ్బు దాహం తీరలేదు. ఇంకా డబ్బు కాజేయాలని మొదటి భార్య, అత్త, బావమరిదితో పథకం పన్నాడు. అందరూ కలిసి ఆమె స్నానం చేసే సమయంలో వీడియోలు తీశారు.రూ. 20 లక్షలు ఇస్తే గానీ వీడియోలు ఇవ్వనని బెదిరించడం మొదలు పెట్టాడు. శ్రీనివాస రెడ్డి దారుణంగా మోసగించడం తో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై పోలీసులు కేసు విచారిస్తున్నారు.