Begin typing your search above and press return to search.
కైట్ ఫెస్టివల్ లో వింత సంఘటన.. గాలిపటంతో గాల్లోకి ఎగిరాడు!
By: Tupaki Desk | 23 Dec 2021 2:30 PM GMTగాలిపటం ఎగరేయడం అంటే పిల్లల నుంచి పెద్దలదాకా చెప్పలేని ఇష్టం. కైట్ ఫెస్టివల్ అంటే చాలు అందరూ ఎగిరి గంతేస్తారు. నా పతంగి పైకి అంటే... నా గాలిపటం పైకి ఎగరాలని పోటీ పడతారు. ఎవరిది ఎంత ఎత్తు ఎగిరితే అంత.. ప్రిస్టేజ్ అన్నమాట. అయితే ఈ పతంగి ఎగురవేసే సమయంలో ప్రమాదాలు జరిగిన ఘటనలు లేకపోలేదు. కొన్ని వింత సంఘటనలు కూడా జరిగాయి. శ్రీలంకలో ఇటీవల నిర్వహించిన కైట్ ఫెస్టివల్ లోనూ ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్ గా మారాయి.
శ్రీలంకలో తైపొంగల్ వేడుక సందర్భంగా ఇటీవల కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనడానికి పిల్లలు, యువత పెద్దఎత్తున తరలివచ్చారు. తమ కైట్ పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో పలువురు వ్యక్తులు ఉత్సహం కనబరిచారు. అందుకే పెద్ద గాలిపటాన్ని రూపొందించారు. దానికోసం జనపనారతో తయారుచేసిన తాడును కట్టారు. ఇక దాన్ని ఎగురవేసే సమయంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. పతంగిని ఎగురవేయకుండా ఓ యువకుడు అలాగే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఫలితంగా గాల్లోకి ఎగిరిపోయాడు. ఇక అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కాగా ఆ యువకుడు 30 అడుగుల ఎత్తుకు ఎగిరాడు. కొన్ని క్షణాల పాటు గాల్లోనే ఉండిపోయాడు.
గాల్లో ఉన్న వ్యక్తి పట్ల ఇక్కడ ఉన్నవారు చాలా ఆందోళనకు గురయ్యారు. తాడును వదిలేయ్ అంటూ కేకలు వేశారు. అయినా కూడా ఆ యువకుడు వదలకుండా భయంతో అలాగే పట్టుకొని ఉన్నాడు. ఇలా కొన్ని సెకండ్లపాటు గాల్లోనే ఉన్నాడు. కాగా గాలిపటం క్రమంగా కిందకు వచ్చింది. అది 10 అడుగుల ఎత్తుకురాగానే దాన్ని వదిలేసి.. కిందకు దూకాడు. ఈ సంఘటనలో ఆ యువకుడికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. అదృష్టవశాత్తు ఇసుకలో పడడం వల్ల ఎటువంటి గాయాలు కూడా కాలేదు. దాంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పిందని అనుకున్నారు.
గాలిపటం ఎగరేస్తూ.. కొన్ని సెకండ్ల పాటు యువకుడు గాల్లో ఉన్న సంఘటనను అక్కడ ఉన్నవారిలో కొందరు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఆ దృశ్యాలను రికార్డు చేసి... సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. నీకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇలాంటి పోటీల్లో జాగ్రత్తగా ఉండాలని మరికొందరు అంటున్నారు. ఆదమరిస్తే అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు.