Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీలో విచిత్రం.. అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్ష సభ్యులుగా!
By: Tupaki Desk | 14 March 2023 2:00 PM GMTఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14న ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా ఏపీ అసెంబ్లీలో తొలిరోజే ఒక విచిత్రం ఆవిష్కృతం కానుంది.
ఇటీవల నెల్లూరు జిల్లా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ సొంత పార్టీ ప్రభుత్వంపైనే వీరిద్దరూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం వీరిద్దరినీ వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నుంచి ఇంచార్జులుగా తప్పించింది. అంతేకాకుండా వారి భద్రతను కూడా కుదించింది.
ఈ నేపథ్యంలో అటు ఆనం రాంనారాయణరెడ్డి, ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆనం, కోటంరెడ్డి నిర్ణయించారు. దీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అసెంబ్లీలోనూ ఆనం, కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లేవనెత్తుతారా అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించేవాళ్లు. ఇప్పుడు వీరిద్దరూ వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ గా మారే అవకాశం ఉంది. అసెంబ్లీలో వీరిద్దరిపై మిగతా ఎమ్మెల్యేలు విరుచుకుపడే చాన్స్ కనిపిస్తోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యుల నుంచి ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు మద్దతు లభిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇన్నాళ్లూ అధికార పార్టీ సభ్యుల హోదాలో ముందు వరుసల్లో వీరు కూర్చునేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అధికార పక్షంలోనే ప్రతిపక్ష సభ్యుల్లా మారడంతో ఆనం, కోటంరెడ్డి ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ వారిద్దరూ సాంకేతికంగా వైసీపీ ఎమ్మెల్యేలే. అలాగే వైసీపీ అధిష్టానం కూడా వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేదు.
ఈ నేపథ్యంలో అటు ఆనం రాంనారాయణరెడ్డికి, ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ సభ్యుల మద్దతు కూడా లభిస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడం ఖాయమేనని అంటున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై తమ సొంత పార్టీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏకిపడేస్తారని చెబుతున్నారు. ఈ సువర్ణావకాశాన్ని ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరూ వదులుకోరని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.