Begin typing your search above and press return to search.

ఒళ్లుచేశారా? అయితే లంచాలు బాగా తిన్నట్టే..! బ్రిటన్ ​లో వింత ఆచారం

By:  Tupaki Desk   |   10 Dec 2020 9:30 AM GMT
ఒళ్లుచేశారా? అయితే లంచాలు బాగా తిన్నట్టే..!  బ్రిటన్ ​లో వింత ఆచారం
X
లంచం అనే సమస్య ఒక్క ఇండియానే కాదు ప్రపంచదేశాలన్నింటినీ పట్టి పీడిస్తున్నది. అయితే ఈ లంచావతారాల సంఖ్య మనదేశంలో కాస్త ఎక్కువ ఉంది. మనదేశంలో అన్ని శాఖలకు ఈ లంచం విస్తరించింది. లంచం తీసుకొని పనిచేయడం వారికి ఓ అలవాటుగా మారింది. ప్రభుత్వశాఖల్లోని ఫైళ్ల కదలిక అంతా నోటు మీదే ఆధారపడి ఉంది. లంచగొండుల ఆటకట్టించేందుకు మనదేశంలో ఏసీబీ అనే వ్యవస్థ ఉన్నది. ప్రతిరోజు అనేకమంది ఏసీబీకి చిక్కుతున్నారు.

నాలుగు రోజులు జైళ్లో గడిపి మళ్లీ దర్జాగా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరగానే మళ్లీ పాత పద్ధతే. అయితే లంచం తీసుకొని దొరికిపోయిన ఉద్యోగిని శాశ్వతంగా ఉద్యోగంలోకి తొలగించాలని అలా చేస్తే భయం ఉంటుందన్న వాదన ఉన్నది. ఇదిలా ఉంటే ధనికదేశాల్లోనూ లంచాలు ఉంటాయి. రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్కడ లంచాలు తింటూనే ఉంటారు. అయితే ఇంగ్లాండ్​లోని బకింగ్​ హామ్​ షైర్ ​కౌంటీలోని హైవికాంబ్​ నగరం లో ఓ లంచగొండులను గుర్తించేందుకు ఓ వింత ఆచారం ఉండేదట. అదేంటంటే ఓ వ్యక్తి మేయర్ ​గా ఎన్నికయ్యాక అతడిని బరువును కొలుస్తారు. మళ్లీ పదవి నుంచి దిగిపోయే సందర్భం లో మరోసారి బరువును కొలుస్తారు. బరువు పెరిగాడంటే లంచం తిన్నట్టే.

అతడు లంచగొండి అని రుజువైతే ప్రజలు కుళ్లిన టమోటాలతో దాడి చేస్తారు. ఆ నగరంలో అప్పటి నుంచి ఇదే ఆచారం కొనసాగుతున్నది. ఇప్పుడు కూడా బరువు ను కొలుస్తున్నారట. అయితే బరువు పెరిగినా టమోటాలు మాత్రం వేయడం లేదట. నిజానికి అధికార దుర్వినియోగాలనికి పాల్పడి డబ్బులు సంపాదించడం, లంచాలు తీసుకోవడం ఒక్క మనదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కానీ మనదగ్గర కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ పద్ధతి ఉన్నది.