Begin typing your search above and press return to search.

ఆడ, మగ రాత్రుళ్లు బట్టలు లేకుండా ఎందుకు పడుకుంటారు..? అసలేంటి కథ..?

By:  Tupaki Desk   |   31 Dec 2022 4:38 AM GMT
ఆడ, మగ రాత్రుళ్లు బట్టలు లేకుండా ఎందుకు పడుకుంటారు..? అసలేంటి కథ..?
X
సాధారణంగా ఎవరైనా నిద్ర పోయేటప్పుడు వదులుగా ఉండే డ్రెస్ వేసుకుంటారు. ఎందుకంటే నిద్రించే సమయంలో శరీరానికి బిగువుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. అయితే లూజుగా ఉండే డ్రెస్ కంటే నగ్నంగా పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భార్యభర్తలు నూలుపోగు లేకుండా కలిసి పడుకోవడం వల్ల కొన్ని రోగాలను దరి చేరకుండా చేయొచ్చని అంటున్నారు. ఇలా నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు సంభవిస్తూ ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. అసలేంటీ కథ..?

ఒక మనిషి 7 గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరిదీ బిజీ లైఫే. చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం టెన్షన్ వాతావరణంలో గడుపుతారు. దీంతో వారు రాత్రంతా సరిగా నిద్రపోరు. వీటితో పాటు కొందరు అవగాహన లేకుండా జీన్స్, షర్ట్ వేసుకొని నిద్రపోతారు. ఇలా పడుకోవడం వల్ల శరీరం బిగువుగా మారుతుంది.

దీంతో రక్త ప్రసరణ సరిగా ఉండదు. అంతేకాకుండా ఇలాంటి వారిలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని కొందరు చెబుతున్నారు. బిగువుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల వీర్య కణాలపై చెడు ప్రభావం చూపుతుందట. అయితే కొందరు మాత్రం లాల్చి పైజామా లేదా నైట్ డ్రెస్ వేసుకొని నిద్రిస్తారు. కానీ శరీరంపై ఎలాంటి దుస్తులు లేకపోవడం మరి మంచిదని అంటున్నారు.

శరీరంపై ఎలాంటి దుస్తులు లేకుండా పడుకోవడం వల్ల బాడీకి మంచి ఆక్సిజన్ అందుతుంది. అంతేకాకుండా శ్వాస తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇలా నిద్రించడం వల్ల మెదడులో ఉండే ట్యాక్సిన్ మటుమాయం అవుతుంది. ముఖ్యంగా శరీరంలో ఉండే బ్రౌన్ ప్యాట్ ను తగ్గిస్తుంది. బ్రౌన్ ప్యాట్ మన శరీరంలో 300 రేట్ల ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఉన్నవాళ్లు ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తెల్ల కొవ్వు (చెడు కొవ్వు ) తయారవుతుంది.

బ్రౌన్ ప్యాట్ చిన్న పిల్లల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే వారు వెచ్చగా ఉంటారు. మన శరీరంలో అదనంగా ఉన్న ఈ కేలరీలను కరిగించడానికి శరానికి రాత్రిపూట మంచి ఆక్సిజన్ అవసరం. ఇక భాగస్వామితో బట్టలు లేకుండా పడుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. ఇది ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. అంతేకాకుండా ఉదయం నుంచి వివిధ పనుల్లో ఉన్న ఒత్తిడినంతా మాయం చేస్తుంది. ఇలా నిద్రించడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇంతకాలం బట్టలపై నిద్రించిన వాళ్లు ఇలా దుస్తులు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోండి. ఇక భాగస్వామితో కలిసి నిద్రిస్తే మరింత ఆరోగ్యంగా తయారవుతారు. అయితే ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నప్పుడే ఇది సాధ్యం కావచ్చు. రోజూ ఇలాంటి పరిస్థితి లేకపోతే వీకేండ్ డేస్ లోనైనా ప్లాన్ వేసుకోండి. కానీ నెలలో కొన్ని సార్లు ఇలా చేయడం వల్ల రాత్రి పూట శరీరానికి మంచి ఆక్సిజన్ ఇచ్చినవాళ్లమవుతాము. తద్వారా కొన్ని రోగాల నుంచి తప్పించుకోగలుతాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.