Begin typing your search above and press return to search.

ఎంపీలకు సామాన్యుల ఝలక్ !

By:  Tupaki Desk   |   22 July 2015 7:39 PM GMT
ఎంపీలకు సామాన్యుల ఝలక్  !
X
ఎక్కడ చూసినా గివ్ ఇట్ అప్... దానికి వందల కోట్ల ప్రకటనల ఖర్చు. పేదలకు సబ్సిడీ అందాలనుకోవడం కరెక్టే, సంపన్నులు వదులుకోమని చెప్పడమూ కరెక్టే.. మరి నీతులు మాట్లాడే ముందు తాము ఏం చేస్తున్నామని తెలుసుకోవాలి కదా. జనం తెలివి తక్కువ వాళ్లేమీ కాదు... ఏం చేసినా అబ్బా అని ఆశ్చర్యపోవడానికి! వారి చేతిలో వజ్రాయుధాన్ని మించిన ఆయుధం ఉంది. అదే సోషల్ మీడియా. సోషల్ మీడియా పవర్ కి ఉదాహరణ మోడీ పీఎం కావడమే. కానీ ఆ వాస్తవాన్ని మరిచిపోతే దాన్ని ఎలా గుర్తుచేయాలో జనానికి తెలుసు.

"మమ్మల్ని సబ్సిడీ వదులుకోమని చెబుతున్నారు. బాగుంది. మరి మీరు పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ వదులుకోండి. అది ఆకలితో చనిపోయే ఒక భారతీయుడిని బతికిస్తుంది" అంటూ ఒక ఉద్యమం మొదలైంది. దానికి చేంజ్.ఆర్గ్ వేదికయ్యింది. ఎంపీలకు ఏం తక్కువ అని సబ్సిడీ భోజనం తింటున్నారు. వారిని ముందు ఆ సబ్సిడీ వదులుకుని ఆ తర్వాత సామాన్యులకు నీతులు చెబితే బాగుంటుంది అంటూ... పునీత్ అగర్వాల్ అనే పౌరుడు పిటిషను పెట్టాడు. దానికి జనం నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే 70 వేల మంది మద్దతు పలికారు.

దీనిని చూసిన వారంతా భలే ఝలక్ ఇచ్చారు ఈ ఎంపీలకు అంటూ అభినందనపూర్వక ఆనందం వ్యక్తంచేస్తున్నారు. త్వరలో అంటే ఒకట్రెండురోజుల్లో లక్షన్నర సంతకాలు అంటే మరో 80 సంతకాలు సేకరించి టార్గెట్ లక్షన్నర పూర్తి చేసేలా కనిపిస్తున్నారు.

Click here the Link : https://www.change.org/p/pmoindia-jithenderredd10-stop-parliament-canteen-subsidy-immediately?source_location=trending_petitions_home_page&algorithm=curated_trending