Begin typing your search above and press return to search.
ర్యాలీ మీద రాళ్లు రువ్వారు.. తర్వాతేమైందో తెలుసా?
By: Tupaki Desk | 30 Dec 2020 8:17 AM ISTరాజకీయ విభేదాలు.. సైద్ధాంతిక వైరుధ్యాలు మామూలే. కొన్నిసార్లు హద్దులు దాటేసే ఇలాంటి వాటి విషయాల్లో తీవ్రమైన చర్యలు పెద్దగా ఉండవు. అందుకు భిన్నంగా మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం జాతీయస్థాయిలో చర్చకు తెర తీసింది. ఇప్పుడా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం తెలిసిందే. మా విషయంలో చిన్న పొరపాటు జరిగినా.. మీకు జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? అన్న రీతిలో ఉన్న చర్య షాకింగ్ గా మారింది. ఇంతకూ అక్కడేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉజ్జయినిలో బీజేపీతో పాటు.. వీహెచ్ పీ.. భజరంగ్ దళ్.. సమగ్రహిందూ సమాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. వీరంతా అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి నిధుల కోసం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అయితే.. ఈ ర్యాలీపై కొందరు వ్యక్తులు ఒక భవనంపై నిలబడి రాళ్లు విసిరారు. దీంతో.. అక్కడ అలజడి చోటు చేసుకుంది. కాస్తంత ఉద్రిక్తతకు కారణమైంది.
ఈ ఉదంతంపై బీజేపీ సర్కారు సీరియస్ అయ్యింది. రాళ్లు రువ్విన వారిని గుర్తించిన అధికారులు.. వారి ఇళ్లను గుర్తించారు. అవన్నీ అక్రమ నిర్మాణాలన్న విషయాన్ని తేల్చిన వారు.. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి.. భవనాల్ని జేసీబీలను పెట్టి కూల్చేశారు. ఆకతాయి చర్యగా కొట్టిపారేయకుండా..కఠినంగా స్పందించిన వైనంపై విమర్శలు రాగా.. అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటే.. మమ్మల్ని తప్పు పడతారా? అంటున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తంగా చూస్తే.. ర్యాలీపై రాళ్ల వర్షానికి.. సదరు వ్యక్తులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.