Begin typing your search above and press return to search.

మంత్రి కాన్వాయ్ లోకి దూసుకెళ్లి రచ్చరచ్చ

By:  Tupaki Desk   |   28 Feb 2017 4:36 AM GMT
మంత్రి కాన్వాయ్ లోకి దూసుకెళ్లి రచ్చరచ్చ
X
పవర్ చేతిలో ఉంటే చెలరేగిపోయే అవకాశాన్ని అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. మరి ముఖ్యంగా జమ్మూకశ్మీర్ లాంటి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పటికీ జనాగ్రహం కానీ ఒక మోస్తరు దాటితే చుక్కలు కనిపించటం ఖాయం. పీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న జహూర్ అహ్మద్ మీర్ కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

పీడీపీ సర్కారులో మంత్రిగా వ్యవహరిస్తున్న జహూర్ అహ్మద్ మీర్ తన కాన్వాయ్ తో పుల్వామా జిల్లాలో పర్యటనకు వెళ్తున్నారు. అయితే.. కొందరు యువకుల గుంపు ఒకటి మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడటమే కాదు.. ఆయన వాహనంపై విచక్షణారహితంగా దాడులు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మంత్రిగారి కాన్వాయ్ మీద దాడికి దిగటంతో ఒక్కసారిగా బిత్తరపోయిన పరిస్థితి.

దుండగుల దాడి చేస్తున్న వైనంపై కాసేపటికే రియాక్ట్ అయిన పోలీసులు.. రాళ్లదాడి చేస్తున్న ఆందోళనకారుల గుంపును పోలీసులు చెదరగొట్టారు. ఈ సమయంలో దాడికి పాల్పడుతున్న వారిని కంట్రోల్ చేయటానికి పోలీసులు ఏకంగా ఫైరింగ్ చేయటమే కాదు.. టియర్.. స్మోక్ షెల్స్ ను ప్రయోగించాల్సి వచ్చింది.

ఊహించనిరీతిలో మంత్రి కాన్వాయ్ పైన దాడికి పాల్పడిన యువకుల బృందంపై భద్రతా సిబ్బంది సంతృప్తికరస్థాయిలో విరుచుకుపడ్డారు.వారిని నిలువరించేందుకు కఠినంగా వ్యవహరించారు. దాడి చేస్తున్న యువకుల గంపుపై భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుతో ఆందోళనకారులు చెల్లా చెదరు కావటమే కాదు.. పరిస్థితులు తమ అదుపులోకి తెచ్చుకోగలిగారు.అయితే..యువకుల గుంపు జరిపిన రాళ్ల దాడిలోఒక పోలీస్ కు గాయాలు కావటం గమనార్హం. మొత్తంగా చూస్తే మాత్రం.. మంత్రి కాన్వాయ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాశ్మీరీ యువకులు రచ్చ రచ్చ చేశారని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/