Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే దానం వియ్యంకుడిపై రాళ్ల దాడి

By:  Tupaki Desk   |   17 March 2021 11:00 AM IST
ఎమ్మెల్యే దానం వియ్యంకుడిపై రాళ్ల దాడి
X
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వియ్యంకుడు అనిల్‌ కుమార్‌ కిషన్ ‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకొని ,ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తన వియ్యంకుడు అయిన దానం నాగేందర్ కి ఫోన్ చేసి చెప్పడం తో అయన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 15లోదానం వియ్యంకుడు అనిల్ కిషన్ నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మీటింగ్‌ ముగించుకొని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నారు. అయితే కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అయన కారు వెనుక అద్దం కొద్దిగా ధ్వంసం అయింది. దీంతో వెంటనే అప్రమత్తమై వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన దానం నాగేందర్ ‌కు ఫోన్‌ చేశారు. జరిగిన విషయాన్ని ఆయనకి వివరించారు. దీనితో వెంటనే అప్రమత్తమైన దానం జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నైట్‌ డ్యూటీలో ఉన్న ఎస్‌ ఐ నాయుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈఘటనలో కారు అద్దాలు పగిలి ఉన్నాయని, సీసీ ఫుటేజీలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నదానిౖపై కూడా పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. అలాగే ఈ ఘటనకు పాల్పడింది ఎవరై ఉంటారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.