Begin typing your search above and press return to search.

స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం: ఒకే రోజు రూ.7 లక్షల కోట్లు ఆవిరి..

By:  Tupaki Desk   |   13 Jun 2022 12:37 PM GMT
స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం: ఒకే రోజు రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
X
దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇదో భారీ పతనం. ఇంత పెద్ద స్థాయిలో మార్కెట్ కుదేలవడం ఇదే ప్రథమం. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి పెరగడం.. చైనా కోవిడ్-19 మెచ్చరికల భయాలు వెరిసీ దేశీయ స్టాక్ మార్కెట్లో మరో ‘బ్లాక్ మండే’ నమోదైంది.

గ్లోబల్ మార్కెట్ల నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాల ప్రభావంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 17 పాయింట్లకు పైగా క్షీణించింది. అయితే చివరకు కాస్తంత కోలుకొని 1456.74 పాయింట్లు పతనమై 52,846.70 వద్ద ముగిసింది. అదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 427.40 పాయింట్లు లేదా 2.64 శాతం మేర నష్టపోయి 15774.40 పాయింట్ల స్థాయికి దిగివచ్చింది.

ఈ భారీ పతనంతో సోమవారం ఒక్కరోజు ఏకంగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. గ్లోబల్ మార్కెట్ల ప్రతీ సంకేతాలు ఇన్వెస్టర్లను తీవ్ర కలవరానికి గురిచేశాయి.

ఈ ప్రభావంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడడంతో భారీ నష్టాలు అనివార్యమయ్యాయి. సెన్సెక్స్ పై అత్యధికంగా నష్టపోయిన స్టాకుల జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహేంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఎన్.టీపీసీ, ఇన్ఫోసిస్, ఎస్.బీఐ షేర్లు ఉన్నాయి. కాగా క్రితం ట్రేడింగ్ సెషన్ కూడా సెన్సెక్స్ 1016 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే.

ఈ భారీ పతనంతో సోమవారం ఒక్కరోజు ఏకంగా రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.251.81 లక్షల కోట్ల నుంచి రూ.245.33 లక్షల కోట్లకు పడిపోయింది.

డాలర్ సూచీ పెరుగుతుండడం.. స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్.పీఐలు పెద్ద మొత్తంలో తరలిపోతుండడం రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మరోవైపు క్రూడ్ ధరలు పెరగడంతో భారత్ చెల్లింపులు ఎక్కువవడం కూడా ఒకింత ప్రతి కూల కారణంగా ఉంది.

దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం జీవితకాల కనిష్టానికి దిగజారింది. డాలర్ తో రూపాయి మారకంలో 78.13 స్థాయికి రూపాయి పడిపోయింది. 20 పైసలు మేర పతనమై 78.29 స్తాయిని తాకింది. దేశీయ మార్కెట్ల భారీ పతనం రూపాయి మారక విలువపై ప్రభావం చూపింది. 2022లో సరికొత్త కనిష్టానికి దారితీసింది.