Begin typing your search above and press return to search.
JNUలో ఆదివారం ఏం జరిగింది..స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ సంచలన నిజాలు!
By: Tupaki Desk | 11 Jan 2020 5:11 AM GMTత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీసీఏ - ఎన్ ఆర్ సి పై పెద్ద ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ముస్లింలు తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం ( జనవరి 5 న ) ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పెద్ద హింసాకాండ జరిగింది. అసలు ఆ ఏం జరిగింది. సబర్మతి హాస్టల్ వద్ద దాడికి కారకులు ఎవరు ? దాడిలో ఏబీవీపీ పాత్ర ఎంత - అంటే ఇండియా టుడే నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తో అవుననే సమాధానం చెప్పాలి. ఏబీవీపీ కార్యకర్తలే జేఎన్ యూఎస్ యూ విద్యార్థులపై దాడి చేశారని - స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడైంది. అసలు ఆదివారం ఏం జరిగింది అంటే ,,,
ఆదివారం ఏం జరిగిందనే అంశంపై ఇండియా టుడే రిపోర్టర్ దాడికి పాల్పడిన అక్షత్ అవస్థి అనే విద్యార్థి ద్వారా ఏం జరిగిందనే విషయాలు తెలయజేశారు. అంతకుముందు రోజు జేఎన్ యూ ఎస్ యూ విద్యార్థులు తమపై దాడికి ప్రతీకారంగానే ఆదివారం దాడి చేసినట్టు అక్షత్ అంగీకరించారు. వామపక్ష విద్యార్థులపై దాడి చేసేందుకు క్యాంపస్ బయట నుంచి కొందరినీ తీసుకొచ్చామని కూడా ఒప్పుకున్నారు. వర్సిటీలో అక్షత్ ఫ్రెంచ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానని ఇండియా టుడే రిపోర్టర్‌కు తెలియజేశారు. జేఎన్ యూలోని కావేరి హాస్టల్ అతను ఉంటున్నారు.
అంతేకాదు 5వ తేదీన జరిగిన వీడియోను కూడా రిపోర్టర్ కు చూపించారు. కర్ర పట్టుకొని - హెల్మెట్ పెట్టుకొని హాస్టల్ కారిడార్ వద్ద పరుగెత్తుతూ కనిపించింది. చేతిలో ఏం ఉంది అని రిపోర్టర్ అడిగితే కర్ర అని.. పెరియార్ హాస్టల్ వద్ద జెండా నుంచి బయటకు తీశానని తెలిపారు. ఎవరిపైనేనా దాడి చేశారా అని ప్రశ్నిస్తే తాను కాన్పూర్ నుంచి వచ్చానని - అక్కడ ప్రతీ వీధిలో గుండాలు ఉంటారని.. తాను కూడా రౌడీననే అర్థంతో అక్షత్ రిపోర్టర్ కు తెలియజేశారు. ఆదివారం కన్నా ముందు పెరియార్ హాస్టల్ పై వామపక్షవిద్యార్థులు దాడి చేయడంతో మరునాడు తాము దాడి చేశామని అంగీకరించారు.
జేఎన్ యూ ఎస్ యూ విద్యార్థులపై దాడి చేసేందుకు అంతమందిని ఎక్కడినుంచి తీసుకొచ్చారని రిపోర్టర్ అడిగితే.. క్యాంపస్ బయట నుంచి ఏబీవీపీ ఆఫీసు బేరర్ల సాయం తీసుకున్నామన్నారు. వామపక్ష విద్యార్థులు - ఉపాధ్యాయులు సబర్మతి హాస్టల్ వద్ద సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారంతో.. ప్రణాళిక ప్రకారం దాడి చేశామని చెప్పారు. అంతేకాదు హాస్టల్ ఎదురుగా ఉన్న వీధిలో వాహనాలు - ఫర్నీచర్లను కూడా ధ్వంసం చేశామని చెప్పారు. దాడి జరిగే సమయంలో అక్కడున్న మిగతావారు పారిపోయారన్నారు. అక్షత్ తోపాటు మరో విద్యార్థి రోహిత్ షా కూడా వర్సిటీలో తాము దాడి చేశామని రిపోర్టర్ కు వెల్లడించారు. అక్షత్ దాడి చేసేందుకు వెళ్లగా తానే హెల్మెట్ ఇచ్చానని.. గ్లాసు పగులగొట్టే సమయంలో తప్పనిసరి అని చెప్పినట్టు రోహిత్ పేర్కొన్నారు.
ఆదివారం దాడి చేసిన వారిలో 20 మంది ఉన్నట్టు రోహిత్ కూడా అంగీకరించాడు. అంతేకాదు అక్షత్.. వామపక్ష విద్యార్థులపై దాడి చేసే సమయంలో ఒక పోలీసు అధికారి సపోర్ట్ చేశాడని సంచలన విషయం వెల్లడించారు. అంతేకాదు పోలీసులు కూడా తమకు సహకరించారని అక్షత్ పేర్కొన్నారు. లైట్లు ఆర్పివేసి దాడి చేసేందుకు సాయం చేశారన్నారు. తాము మొహలకు ముసుగు వేసుకొని దాడికి చేశామని - వారు ఇదివరకు చేసిన పనినే చేశామని చెప్పారు. జేఎన్ యూలో దాడికి సంబంధించి అక్షత్, రోహిత్ షా ఇండియా టుడే సింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలు వెల్లడించిన వెంటనే.. ఏబీవీపీ స్పందించింది. వారికి ఏబీవీపీ సంస్థతో సంబంధం లేదని తేల్చిచెప్పింది. జేఎన్ యూఎస్ యూ కార్యకలపాల్లో కూడా వారు పాల్గొనలేదని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి తెలిపారు.