Begin typing your search above and press return to search.

పోర్న్‌ స్టార్‌ గా మారుతానని ప్రకటించిన రెండు వారాలకే స్పీల్‌ బర్గ్ కూతురు అరెస్ట్

By:  Tupaki Desk   |   2 March 2020 3:30 AM GMT
పోర్న్‌ స్టార్‌ గా మారుతానని ప్రకటించిన రెండు వారాలకే స్పీల్‌ బర్గ్ కూతురు అరెస్ట్
X
స్టీవెన్ స్పీల్‌ బర్గ్ పెంపుడు కూతురు మికేలా స్పీల్‌ బర్గ్‌ ను టెన్నెస్సీ లోని నాష్‌ విల్లీలో పోలీసులు డొమెస్టిక్ వయొలెన్స్ కింద అరెస్ట్ చేశారు. ఆమెను 12 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు. తాను పోర్న్ ఇండస్ట్రీలో కెరీర్‌ ను ఎంచుకుంటున్నానని రెండు వారాల క్రితం మికేలా ప్రకటన చేశారు. ఆ ప్రకటన అనంతరం రెండు వారాలకే పోలీసులు డొమెస్టిక్ వయొలెన్స్ కింద అరెస్టు చేశారు.

సమాచారం మేరకు... 23 ఏళ్ల మికేలా స్పీల్‌బర్గ్ శనివారం ఉదయం 6.30 సమయానికి అరెస్టయ్యారు. ఆమెపై డొమెస్టిక్ వయొలెన్స్ - గాయపరిచారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆమెను పన్నెండు గంటల పాటు స్టేషన్ లో ఉంచారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ మార్చి 9వ తేదీన ఉంది.

మికేలాకు కాబోయే భర్త చౌక్ పాంకౌ (47) ఆమె అరెస్టును ధృవీకరించారు. ఇది కేవలం చిన్న మిస్ అండస్టాండింగ్ వల్ల జరిగిందని, ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

తాను సెల్ఫ్ ప్రొడ్యూసింగ్ సోలో అడల్డ్ సినిమా వీడియోలు తీస్తానని ఇటీవల మికేలా ప్రకటన చేశారు. దీనికి తన తల్లిదండ్రులు స్టీవెన్ స్పీల్‌ బర్గ్ - కేట్ కాప్షాల పర్మిషన్ ఉందని, తన కెరీర్‌ను తాను సొంతగా ఎంచుకునే అవకాశం కల్పించారని చెప్పారు. తద్వారా సొంతగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావించారు.

తాను చాలా లైంగిక స్వభావం కలిగిన వ్యక్తినని - పోర్న్ స్టార్‌ గా కెరీర్ ఆరంభించాలని నిర్ణయం తీసుకున్నానని 23 ఏళ్ల మికేలా చెప్పారు. వయస్సు మళ్లివారితో శృంగారం తనకు ఇష్టమని చెప్పారు. సెక్స్ వీడియోల్లో సోలోగా కనిపిస్తానన్నారు. ఆమె పోర్న్ వీడియోలు చేయబోతున్నానని ప్రకటించిన అనంతరం ఇరుగుపొరుగుతో సంబంధాలు దెబ్బకొట్టాయని - దీంతో గృహహింసకు పాల్పడిందనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ప్రియుడు వెయ్యి డాలర్ల పూచీకత్తుపై ఆమెను బయటకు తీసుకు వచ్చాడు. స్టీవెన్ స్పీల్‌ బర్గ్-కేట్ కాప్ షాలు మికేలాను కాకుండా మరో ఆరుగురిని కూడా దత్తత తీసుకున్నారు.