Begin typing your search above and press return to search.
చదువును మధ్యలోనే వదిలేసి.. కోటీశ్వరుడిగా ఎదిగి..!
By: Tupaki Desk | 19 Nov 2021 12:30 AM GMTపిల్లలను బాగా చదువుకోవాలని అందరూ చెబుతుంటారు. బాగా చదివితే జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడతారని అంటారు. ఉన్నత చదువులు చదివితే లైఫ్ లో రిస్క్ లేకుండా బతకవచ్చనేది కొందరి అభిప్రాయం. ఎవరైన చదువులో కాస్త వెనుకబడి ఉంటే చదువురాకపోతే ఎలా బతుకుతావని నిలదీస్తారు. స్కూల్ కు వెళ్లను అంటే చివాట్లు పెడతారు. మంచి జీవితం కోసం చదువు తప్పనిసరి అని చెప్తారు. అయితే బాగా చదువుకుంటేనే మంచి జీవితం అనేది అపోహమాత్రమే. మనసు ఉండాలని కానీ మార్గం ఉంటది. చదువుతో సంబంధం లేకుండా బతుకు బండిని పరుగులు పెట్టించవచ్చు. చదువును మధ్యలోనే వదిలేని అత్యుత్తమ వ్యాపారవేత్తలుగా ఎదిగిన మందిని ఎందరినో చూశాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈయన కూడా అదే కోవకు చెందినవారు.
ఈయన చదువును మధ్యలోనే వదిలేశారు. అయితేనేం ఇవాళ గొప్పగా ఎదిగారు. ఆరోజు పాఠశాల స్థాయిలోనే బడి మానేసినా కూడా బతుకు పాఠాలను బాగా వంటబట్టించుకున్నారు. అందుకే నేడు కోటీశ్వరునిగా మారారు. ఆయనే యూకేలోని యోర్క్ షైర్ కు చెందిన స్టీవ్ పార్కిన్. ఈయన 16 ఏళ్లకే బడి పాఠాలకు స్వస్తి చెప్పారు. అలా బలాదూర్ గా తిరగకుండా డ్రైవింగ్ నేర్చుకున్నారు. చోదకుడిగా నైపుణ్యం సాధించి లైసెన్స్ సంపాదించారు. ఆ విధంగా డ్రైవర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఓ బట్టల దుకాణానికి డ్రైవర్ గా పనిలో చేరారు. ఇక అప్పటి నుంచి వెనకకు చూసుకోకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు.
బట్టల షాపులో డ్రైవర్ గా పనిచేసే ఆయన పరిచయాలు పెంచుకున్నారు. అనేక కంపెనీల్లో పనిచేసి అనుభవం సాధించారు. ఆ తర్వాత స్టీవ్ క్లిప్పర్ అనే లాజిస్టిక్ కంపెనీని స్థాపించారు. దాన్ని చిన్నగా వృద్ధిలోకి తీసుకొచ్చారు. డ్రైవర్ గా పనిచేసిన నైపుణ్యంతో తన కంపెనీని గాడిలో పెట్టారు. ఆ కంపెనీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ఇకపోతే కరోనా వేళ వద్దకే సేవలను విస్తరింపజేశారు. నాణ్యమైన సేవలను హోం డెలివరీ చేసి మంచి ఫీడ్ బ్యాక్ పొందారు. ఫలితంగా కంపెనీ టర్నోవర్ అమాంతం పెరిగింది. ఒక్కసారిగా 39.1 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఆదాయం 700 మిలియన్ పౌండ్లకు చేరింది. ఇకపోతే ఈ కంపెనీలో దాదాపు పది వేల మంది వరకు ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు.
జీవితంలో రాణించాలంటే చదువు ఒక్కటే ప్రామాణికం కాదని నిరూపించారు స్టీవ్. అందుకే ఆయన పాఠశాల స్థాయిలో బడి మానేసినా కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయన కోటీశ్వరునిగా మారడమే కాకుండా పది వేల మందికి ఉపాధిని అందిస్తున్నారు. కాబట్టి బట్టీ చదువులు చదివి... ఏ ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో పిచ్చి నిర్ణయాలు తీసుకునేవారు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మార్కులు, ఉద్యోగాలు మాత్రమే అవకాశాలు కావు. మనం సృష్టించుకుంటే ప్రతీది అవకాశమే. స్టీవ్ లాంటి వాళ్లు పాఠశాల స్థాయిలోనే చదువులకు స్వస్తి చెప్పినా కోటీశ్వరులుగా ఎదిగారు. వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు.