Begin typing your search above and press return to search.

ఇక ఆ సౌండ్స్ వినిపించవు ... హారన్‌ ప్లేస్ లో ఆ సంగీత..

By:  Tupaki Desk   |   6 Sep 2021 10:45 AM GMT
ఇక ఆ సౌండ్స్ వినిపించవు ... హారన్‌ ప్లేస్ లో ఆ సంగీత..
X
రణగొణ ధ్వనులతో దేశం మొత్తం మోత మోగుతోంది. నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ నడుమ చెవులు చిల్లులు పడే రేంజ్‌ ఆ సౌండ్స్ ను భరిస్తూ, వాహనదారులు ముందుకు పోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సినారియోను మార్చేందుకు కేంద్రం సరికొత్త ఆలోచన చేయబోతోంది. విచిత్రమైన, ఘోరమైన శబ్దాలు చేసే హారన్‌ సౌండ్‌ల్ని మార్చేసే దిశగా ఆలోచన చేయనున్నట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. మరాఠీ న్యూస్‌ పేపర్‌ లోక్‌మట్‌ కథనం ప్రకారం.. నాగ్‌పూర్‌లో ఓ భవనంలో పదకొండవ అంతస్తులో నివాసం ఉంటున్న గడ్కరీకి.. ప్రశాంతంగా గంటసేపు ప్రాణాయామం కూడా చేసుకోని పరిస్థితి ఎదురవుతోందట. వాహనాల రోదనల వల్ల అంత ఎత్తులో ఉన్న తన పరిస్థితే అలా ఉంటే, సాధారణ పౌరులు ఆ గోలను ఎలా భరిస్తున్నారో తాను ఊహించుకోగలనని చెప్తున్నారాయన.

అందుకే వాహనాల హారన్‌ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఇప్పుడున్న వెహికిల్‌ హారన్‌ ల ప్లేస్‌ లో తబలా, వయొలిన్‌, ఫ్లూట్‌, ఇలా రకరకాల వాయిద్యాల శబ్దాలను పరిశీలించబోతున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో కార్లకు ఈ ఆలోచనను అమలు చేయబోతున్నట్లు, ఈ మేరకు త్వరలో కంపెనీలకు సూచనలు సైతం పంపిచనున్నట్లు గడ్కరీ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది. ఒకవేళ కేంద్రం గనుక కరాకండిగా ఈ రూల్స్‌ అమలు చేస్తే మాత్రం, వాహన తయారీదారీ కంపెనీలపై అదనపు భారం పడనుంది. హారన్‌ శబ్దాల వల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మనుషుల్లో చెవుడుతో పాటు ఆందోళన, ఒత్తిళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి.

సాధారణంగా అతి ధ్వనులను అవతి వాహనాలు , వ్యక్తులు తప్పిపోయిన సమయాల్లో.. దూరం నుంచి వాహనాలు వస్తున్నాయనే అలర్ట్‌ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగించాలని రూల్స్‌ చెప్తున్నాయి. కానీ, ఈ రూల్స్‌ అమలు కావడం లేదు. రోడ్ల మీద వెళ్లే వాహనాల విషయంలోనే కాదు.. షిప్స్‌, రైళ్ల విషయంలోనూ ఈ నిబంధనలు పాటించాలి. సాధారణంగా రైళ్ల హారన్‌ 130-150 డెసిబెల్స్‌ దాకా ఉంటుంది. దూరం ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్ద తీవ్రతతో హారన్‌ కొట్టాలి. ప్లాట్‌ ఫామ్‌ మీదకు వచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్‌ సౌండ్‌ హారన్‌ కొట్టడం రూల్స్‌ కి వ్యతిరేకం. కొన్ని చోట్ల హారన్‌లు కొట్టడానికి వీల్లేదు. అలాంటి ప్రాంతాల్ని ‘నో హాంకింగ్‌ జోన్స్‌’ అంటారు. మన దేశంలో ఎక్కడా అలాంటి జోన్లను ఏర్పాటు చేయలేదు. కేవలం శబ్ద తీవ్రత పరిమితిని మించినప్పుడు.. అదీ ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నారు.