Begin typing your search above and press return to search.

షాతో భేటీ వర్క్ వుట్ అయ్యిందిగా.. జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

By:  Tupaki Desk   |   18 Feb 2020 5:00 AM GMT
షాతో భేటీ వర్క్ వుట్ అయ్యిందిగా.. జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
X
గంటకు పైనే ప్రధాని మోడీ తో.. నలభై నిమిషాలు కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తాను కోరుకున్నట్లు గా ‘పనులు’ జరిగేలా చేసుకోవటం లో సక్సెస్ అయ్యారని చెప్పాలి.తాజాగా ఆయన జరిపిన ఢిల్లీ టూర్ ఏ మేరకు సక్సెస్ అయ్యిందన్న విషయాన్ని తెలియజేసేలా కేంద్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్.. ఆంధ్రాకు అవసరమైన అధికారుల్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ లోని పలువురు అధికారులు ఏపీకి బదిలీ అయ్యేలా కేసీఆర్ సర్కారును ఒప్పించగలిగారు. అయితే.. కేంద్రం మాత్రం ఈ వ్యవహారంలో మోకాలడ్డింది. ముఖ్యంగా దివంగత మహా నేత.. కమ్ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఛీప్ సెక్యురిటీ అధికారికిగా పని చేశారు స్టీఫెన్ రవీంద్ర. రాయలసీమలో పలు బాధ్యతలు చేటప్టిన ఆయన 1990 బ్యాచ్ కు చెందిన వారు.

ఆయన్ను ఏపీకి తీసుకొచ్చి.. కీలక బాధ్యతలు అప్పజెప్పాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం సానుకూలంగా రాలేదు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్స్ ను కేంద్రం నో చెప్పిందన్న ప్రచారం సాగుతున్న వేళ.. మోడీ సర్కార్ అనూహ్యంగా వ్యవహరించింది. తాజాగా జగన్ కు గుడ్ న్యూస్ చెబుతూ.. స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి పంపేందుకు ఓకే చెప్పేసింది.దీనంతటికి కారణంగా తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కావటమే.. తాజా నిర్ణయం వెలువడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు తాను కోరినట్లు గా పని జరిపించుకోవటం లో సీఎం జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కోరి మరీ ఏపీకి తీసుకెళుతున్న స్టీఫెన్ రవీంద్ర కు ఏ బాధ్యత అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.