Begin typing your search above and press return to search.
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కింద పొంచి ఉన్న ముప్పు!
By: Tupaki Desk | 20 Oct 2020 7:00 AM GMTహైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులు తొలగించేందుకు ఫ్లైఓవర్లు కట్టిన తెలంగాణ సర్కార్ వాటి రక్షణ, భద్రత విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఘనంగా ప్రారంభించిన ‘బయోడైవర్సిటీ’ ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు కలవరపెట్టాయి. ఇప్పటికే ఓ కారు పల్టీలు కొట్టి ఒక మహిళ మరణానికి దారితీసింది. ఫ్లైఓవర్ సరిగా సాంకేతికంగా కట్టలేదని.. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ సంఘటన తర్వాత ఫ్లైఓవర్ ను దాదాపు 2 నెలలు మూసివేశారు. ఆ ఫ్లైఓవర్ పై భద్రతా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ప్రయాణించేందుకు తెరిచారు.
అయితే తాజాగా బయోడైవర్సిటీ కింద మరో ప్రమాదం కలవరపెడుతోంది. ఈ ఫ్లైఓవర్ కింద ఉన్న ఒక ఇనుప కడ్డీ దాని కింద గుండా పోయే రహదారిపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కింద ఎవరూ లేరు.ఒకవేళ బైక్, కారు దాని కింద పోతున్నప్పుడు పడితే వారి ప్రాణాలు పోయేవి.
ఈ ఘటనతో మరోసారి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నాణ్యత, రూపకల్పనపై ఆందోళనలు పెరిగిపోయాయి. ఒక వ్యక్తి ఈ ఇనుప కడ్డీ పడిపోయిన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఫ్లైఓవర్ నాణ్యతపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.